జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తేవద్దు: బాలయ్య కండిషన్
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఆహా ఓటీటీలో ప్రసారమవుతోంది. ప్రస్తుతం నాలుగో సీజన్ నడుస్తోంది. హీరోలు సూర్య, వెంకటేష్, డాకు మహారాజ్ టీం, అల్లు అర్జున్, రామ్ చరణ్, దుల్కర్ సల్మాన్, నవీన్ పొలిశెట్టి, శ్రీలీల, అనిల్ రావిపూడి, తమన్, దర్శకుడు బాబీ, నాగవంశీ తదితరులు వచ్చారు. వారంతా వారివారి సినిమాల ప్రమోషన్స్ లో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలకృష్ణ యాంకర్ గా బాగా చేస్తుండటంతో ప్రోగ్రాం కూడా సూపర్ హిట్ అయింది. మరో రెండు, మూడు ఎపిసోడ్స్ తో ఈ సీజన్ ముగిసే అవకాశం ఉంది.
ముందుగానే చెప్పేస్తున్న బాలకృష్ణ
ఈ షోలో పాల్గొనేందుకు వచ్చేవారికి బాలయ్య ముందుగానే ఓ కండిషన్ పెడుతున్నాడని తెలుస్తోంది. ఎవరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురావద్దని కచ్చితంగా చెప్పేస్తున్నారు. అంతేకాకుండా ఏవీల్లో కూడా తారక్ ప్రస్తావన తేవొద్దని, అలాగే ఆహా నిర్వాహకులకు ఇదే విషయాన్ని తెగేసి చెప్పాడంట. కార్యక్రమానికి వచ్చే అతిథులకు ఆయన ముందుగానే ఈ విషయాన్ని చెప్పేస్తున్నారు. దీంతో ఆహా నిర్వాహకులతోపాటు కార్యక్రమానికి వచ్చేవారు జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావనకు తీసుకురాకుండా మాట్లాడుతున్నారు. తాజాగా దర్శకుడు బాబీ మాట్లాడిన తీరుతో ఈ విషయం బయటపడింది. బాబీ మాట్లాడుతూ తాను చేసిన హీరోలతో తన అనుభవాలను చెప్పాడు.

కావాలనే బాబీ చేత తారక్ పేరు చెప్పించలేదు
చిరంజీవి, పవన్ కల్యాణ్, రవితేజ పేర్లు చెప్పాడుకానీ జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పలేదు. తారక్ తో బాబీ జై లవకుశ సినిమా తీశాడు. కావాలనే ఉద్దేశపూర్వకంగా బాబీ చేత తారక్ పేరు రాకుండా మాట్లాడించారు. అలాగే నిర్మాత నాగవంశీ మాట్లాడే సమయంలో కూడా తారక్ పేరు తీసుకురాలేదు. ఈ విషయాలన్నింటినీ గమనిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బాలయ్యపై మండిపడుతున్నారు. తారక్ పాన్ ఇండియా హీరో అయ్యారని, ఆయన పేరు ప్రస్తావనకు తీసుకురానంత మాత్రాన అవేవీ ఆయన ఇమేజ్ ను, క్రేజ్ ను తగ్గించలేవంటున్నారు. బాలయ్య తన వారసుడిగా మోక్షజ్ఞను త్వరలోనే వెండితెరకు పరిచయం చేయబోతున్నారు. ఐఫా అవార్డుల్లో కూడా తన వారసుడు మోక్షజ్ఞ అనే చెప్పారు బాలయ్య.












Click it and Unblock the Notifications