‘పుష్ప2’ రికార్డును బద్ధలు కొట్టిన‘ డాకూ మహారాజ్’
బాబీ దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 'డాకూ మహారాజ్' నెట్‌ఫ్లిక్స్‌లో సంచలన రికార్డులు నెలకొల్పుతోంది. ఈనెల 20వ తేదీ అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమైన తర్వాత వరల్డ్ వైడ్ గా 8 రోజులు నెంబర్ వన్ మూవీగా నిలిచింది. అల్లు అర్జున్ నటించిన 'పుష్ప2' కేవలం ఏడురోజులే నెంబర్ వన్ గా నిలవడం మీరు గమనించాలి. 'డాకూ మహారాజ్' ఇప్పటికీ ఇండియాతోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఖతార్, యూఏఈ దేశాల్లో టాప్ ట్రెండింగ్ లో నెంబర్ వన్ గా నిలిచింది. మరో 13 దేశాల్లో టాప్-10లో ఒకటిగా ఉంది.
పిచ్చెక్కిపోతున్న మళయాళీలు
పాకిస్తాన్ లో 'డాకూ మహారాజ్' చూసి అక్కడి జనాలు పిచ్చెక్కిపోతున్నారు. మనదగ్గర తమిళం, మళయాళం, కన్నడం, హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. అన్ని భాషల్లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. 'పుష్ప2' కేరళలో అట్టర్ ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. అయితే మళయాళీలు 'డాకూ మహారాజ్' చూసి వెర్రెక్కిపోతున్నారు. విజువల్ మాస్ ఫీస్ట్ అని, మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ నెక్ట్స్ లెవల్ లో ఉందంటున్నారు. అలాగే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే నాన్ ఇంగ్లిషు సినిమాల్లో వరల్డ్ వైడ్ గా 5వ స్థానాన్ని సంపాదించింది. నెట్ ఫ్లిక్స్ తన ఇండియా సౌత్ పేజీ డిస్క్రిప్షన్ లో లో 'డాకూ మహారాజ్' ను ఉద్దేశించి ప్రణామ్ మహారాజ్ అని ట్యాగ్ లైన్ పెట్టిందంటే ఎంత రెస్పాన్స్ వస్తుందో అర్థం చేసుకోండి. రాబోయే రోజుల్లో మరెన్ని రికార్డులు కొల్లగొట్టనుందో చూడాలి.

అదిరిపోయే సంగీతాన్నిచ్చిన తమన్
బాలయ్య కథానాయకుడిగా నటించిన 'డాకూ మహారాజ్' సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాల్లో చైల్డ్ సెంటిమెంట్ తోపాటు బాలయ్య ఎలివేషన్స్, యాక్షన్ సన్నివేశాలకు తమన్ సంగీతం విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. దబిడి దిబిడి పాట కూడా కీలక పాత్ర పోషించింది. కథ పాతదే అయినప్పటికీ దర్శకుడు బాబీ తన దర్శకత్వ ప్రతిభతో సినిమాను అందరికీ మలిచేలా రూపొందించారు. ఈ సినిమాతో వరుసగా నాలుగుసార్లు రూ.100 కోట్లు సాధించిన సీనియర్ హీరోల్లో ఒక్కడిగా అరుదైన రికార్డును నెలకొల్పారు. ఈ సినిమా మొత్తం రూ.185 కోట్లు గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది. సంక్రాంతి సమయంలో కుటుంబ ప్రేక్షకులంతా వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్'నాం సినిమాకు ప్రాధాన్యం ఇవ్వడంతో కొంచెం కలెక్షన్లు తగ్గాయికానీ రూ.250 కోట్ల వరకు గ్రాస్ వచ్చేది విశ్లేషకులు అంచనా వేశారు.












Click it and Unblock the Notifications