అందుకే శ్రీదేవితో నటించలేదు : బాలకృష్ణ
అతిలోక సుందరి శ్రీదేవి గురించి కొత్తగా చెప్పాడానికి ఏం ఉంటుంది. భూలోక సుందరిగా పేరు గాంచిన శ్రీదేవి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు దక్కించుకుంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ వంటి పాతతరం హీరోలతో పాటు, చిరంజీవి, నాగార్జున,వెంకటేష్ వంటి రెండోతరం హీరోలతో కూడా ఆమె నటించారు. అయితే రెండోతరంలో ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణతో మాత్రం ఆమె నటించలేకపోయారు.
బాలకృష్ణ, శ్రీదేవి కాంబినేషన్ కోసం అభిమానులు ఆశగా ఎదురు చూసినప్పటికి , వారికి నిరాశ తప్పలేదు. అయితే వీరిద్దరు కలిసి నటించకపోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా దీనిపై స్పందించారు బాలకృష్ణ. సినీ కెరీర్‌లో బాలకృష్ణ 50 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సినీ, రాజకీయాలతో పాటు తన పర్సనల్ లైఫ్ గురించి బాలకృష్ణ ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రీదేవితో ఎందుకు నటించలేదో ఆయన వివరించారు. శ్రీదేవితో నటించకపోవడానికి కారణాలు ఏమీ లేవని, యాదృశ్చికంగానే ఇది జరిగిందని ఆయన బాలకృష్ణ చెప్పుకొచ్చారు.

సినిమాల్లో ఆర్టిస్ట్‌ల ఎంపిక చాలా ముఖ్యమని, శ్రీదేవి లాంటి గొప్ప యాక్టర్‌ని సాదాసీదా సినిమాలో పెడితే ఏం బాగుంటుంది. అలా ఒకటి రెండు సినిమాల్లో శ్రీదేవిని బలవంతంగా పెట్టాలని చూశారు. కానీ తానే వద్దని చెప్పానని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. శ్రీదేవి స్థాయి వేరని, ఆమెతో సినిమా చేయాలంటే కథ అద్భుతంగా ఉండాలని , ఏదో ఆమెను పెట్టి సినిమా చేసినట్టు ఉండకూడదని బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా చిరంజీవితో శ్రీదేవి నటించిన ''జగదేక వీరుడు అతిలోక సుందరి'' సినిమాను గుర్తు చేశారు. ఆ సినిమాలో శ్రీదేవి నిజంగా దేవకన్యలా ఉన్నారని, అలాంటి సినిమాల్లో శ్రీదేవి నటిస్తే బాగుంటుంది కానీ, మాములు కథలో కూడా శ్రీదేవిని పెట్టి సినిమా చేస్తే అది ఆమె స్థాయిని తగ్గించినట్టే అవుతుందని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications