పవన్ కల్యాణ్‌పై బండ్ల గణేష్ సెటైర్లు..? కృతజ్ఞత లేని వ్యక్తి అంటూ
ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. గత కొంతకాలంగా వరుసగా వార్తల్లో నిలుస్తున్నారాయన. తెలంగాణ ఎన్నికల సమయంలో ఆయన మీడియాలో తెగ హల్ చల్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుగా బండ్ల గణేష్ ప్రచారం కూడా నిర్వహించారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సమయంలో బండ్ల గణేష్ చేసిన హడావిడి అంత ఇంత కాదు.
ఫలితాల సమయంలో తనదైనశైలిలో బీఆర్ఎస్ పార్టీపై ట్వీట్లు చేశారాయన. బండ్ల గణేష్ పవన్ కల్యాణ్‌కు వీర భక్తుడనే విషయం అందరికీ తెలిసిందే. పవన్ కల్యాణ్ నటించిన తీన్‌మార్, గబ్బర్ సింగ్ సినిమాలకు బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించారు. ముఖ్యంగా గబ్బర్ సింగ్ సినిమాతోనే బండ్ల గణేష్ ఇండస్ట్రీలో నిర్మాతగా నిలదొక్కుకున్నారు.కొంతకాలంగా ఆయన సినిమాలకి దూరంగా ఉన్నా సినిమా ఇండస్ట్రీ మాత్రం ఆయన్ని దూరం చేసుకోలేదు. పలు సినిమాల ప్రీ రిలీజ్, సక్సెస్ మీట్లకు హాజరవుతూ ఆయన చేసే కామెంట్స్ తెగ వైరల్ అవుతుంటారు. బండ్ల గణేష్ ఈవెంట్‌కి వస్తున్నాడంటే కచ్చితంగా రచ్చ జరుగుతుందని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు.

తనకు నచ్చిన వ్యక్తిపై ఎంతగా ప్రశంసలు కురిపిస్తాడో.. ఎవరైనా నచ్చకపోతే ట్వీట్ల ద్వారా సెటైర్లు వేస్తుంటారు. పవన్ కళ్యాణ్ కి భక్తుడినని చెప్పుకునే బండ్ల గణేష్ ఆయన్ని ఎవరైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకోడు. గతంలో ఈశ్వరా.. పరమేశ్వరా.. పవనేశ్వరా.. అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఇచ్చిన స్పీచ్ తెగ వైరల్ అయింది. పవన్ కళ్యాణ్‌ని ప్రశంసలతో ఉక్కిరిబిక్కిరి చేసే బండ్ల గణేష్ ఈ మధ్యకాలంలో ఆయన ఊసు పెద్దగా ఎత్తడం లేదు. ఇటీవల పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్లకు ఆయన్ని ఆహ్వానించక పోవడంతో అలిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.కొంతమంది నీ కోసం ఎంత చేస్తున్నావో చూడరు. నీవు చేయని వాటిని మాత్రమే చూస్తారు. కృతఙ్ఞత లేని వ్యక్తిని ఎప్పటికీ సంతృప్తిపరచలేవు' అంటూ బుధవారం ఉదయం బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్ పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించే చేసి ఉంటాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన 'ఓజీ' ఈవెంట్‌కి ఆయన్ని ఆహ్వానించకపోవడంతో అలిగి ఇలా కామెంట్ చేసి ఉంటాడని అనుకుంటున్నారు. బండ్ల గణేష్ ట్వీట్‌కి నెటిజన్లు స్పందిస్తూ.. నీ గురించి నువ్వే చెప్పుకుంటున్నట్లు ఉంది అన్న అంటూ కొందరు. .నిన్ను 'ఓజీ' ఈవెంట్‌కి పిలవలేదని మండుతున్నట్లు ఉంది' అంటూ మరికొందరు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.అయితే తాజాగా 'లిటిల్ హార్ట్స్' మూవీ ఘన విజయం సాధించడంతో ' కొడితే నీలా కొట్టాలి రా బాబు దెబ్బ...చంపేశావ్ ఇక దున్నే టాలీవుడ్ నీదే!' అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు.
అంతేకాదు ఈ చిత్ర సక్సెస్ మీట్‌కి హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో కొన్ని మాఫియా వ్యవస్థలు మనల్ని బ్రతకనివ్వవు. ఇక్కడ కొంతమందే బాగుంటారు. ఒకరు స్టార్ కమెడియన్ కొడుకుగా పుడతాడు, మెగాస్టార్ బావమరిదిగా ఉంటాడు, ఐకాన్ స్టార్ తండ్రిగా ఉంటాడు. అలాంటి వాళ్లకి లైఫ్ ఈజీగా ఉంటుంది అంటూ అల్లు అరవింద్ ని ఉద్దేశించి అన్నాడు.మన లాంటి వాళ్లు మాత్రం తమ కష్టంతోనే ముందుకు రావాలి. అదే నిజమైన ప్రయాణం' అన్నారు. ఇదే ఈవెంట్లో ఆడియన్స్ ఓజీ ఓజీ అని గోల చేయగా.. పవన్ కళ్యాణ్‌కి ఉండే కోట్లాది మంది భక్తుల్లోనే నేనూ ఒకడిని. అంతకుమించి నాకు వేరే క్వాలిఫికేషన్ లేదు. ఓజీ బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుంది' అని కామెంట్స్ చేశారు.
-
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీలో శ్రీలీల పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..? -
అన్న మళ్లీ హిట్ కొట్టాడోచ్.. పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ రివ్యూ..! -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
Pawan kalyan vs Ranveer Singh:ఉస్తాద్ వర్సెస్ ధురందర్..హ్యాట్రిక్ పోరులో గెలుపెవరిది? -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
రామ్ చరణ్ 'పెద్ది'లో క్రేజీ ఐటమ్ సాంగ్.. ముగ్గురు స్టార్ హీరోయిన్లతో మాస్ స్టెప్పులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..!












Click it and Unblock the Notifications