A to Z చేసింది ఆ నటి, పవిత్ర ప్లాన్ తో హీరో జైలుకు, మామల విచారణలో కలకలం?
రేణుకాస్వామి హత్యకేసుకు సంబంధించి విచారణ పోలీసుల బృందం కోర్టుకు సమర్పించిన రిమాండ్ కాపీలో పలు కీలక సమాచారం వెల్లడైంది. కన్నడ స్టార్ హీరో దర్శన్, అతని గ్యాంగ్ దారుణ హత్య చేశారని నమోదు అయిన కేసు దర్యాప్తులో చాలా చీకటి కోణాలు బయటపడ్డాయని సమాచారం. ప్రధానంగా రేణుకాస్వామి హత్యకేసును పన్నాగం పన్నింది నటి అని వెలుగు చూడటం కలకలం రేపుతోంది.
హీరో దర్శన్‌తో పాటు ఇతర నిందితులను ఉసిగొల్పింది నటి పవిత్ర గౌడ అని పోలీసుల రిమాండ్ కాపీలో సమాచారం వెల్లడైందని కన్నడ మీడియా బయటపెట్టింది. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ కాపీలో ఈ వివరాలు వెల్లడైనాయని సమాచారం. రేణుకాస్వామిని హతమార్చేందుకు నటి పవిత్ర గౌడ పథకం పన్నిందని, పవిత్ర గౌడ ఈ హత్య కేసులో ప్రధాన నిందితురాలు అని పోలీసు అధికారులు కోర్టుకు సమాచారం ఇచ్చారని తెలిసింది.

హత్యకు పథకం వేసేందుకు నటుడు దర్శన్‌తో పాటు ఇతర నిందితులను నటి పవిత్రా గౌడ ప్రేరేపించి ప్రత్యక్షంగా ఈ హత్యకు కారణం అయ్యిందని పోలీసుల విచారణలో తేలిందని రిమాండ్ కాపీలో పేర్కొన్నారని కన్నడ మీడియా తెలిపింది.ఈ నిందితులకు చట్టం పట్ల గౌరవం లేదని సాక్ష్యాధారాలు నిర్ధారించాయని పోలీసులు రిమాండ్ కాపీలో పేర్కొన్నారు. హత్య ఘటన తర్వాత బెంగళూరులోని పట్టగెరె షెడ్డు కాపలాదారులకు పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇవ్వకుండా దర్శన్ గ్యాంగ్ తరపున కొందరు డబ్బులు ఇప్పించారని వెలుగు చూసింది.
అయితే ప్రత్యేకంగా ఎవరి నుంచి డబ్బులు ఇప్పించారు అనే విషయాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. కేసు నుంచి తప్పించుకునేందుకు దర్శన్ తన ఇంట్లో రూ. 40 లక్షలు దాచుకున్న విషయం కూడా పోలీసుల విచారణలో వెలుగు చూసింది. హత్య కేసుకు సంబంధించి దర్శన్‌ను రెండోసారి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా రూ. 40 లక్షలు. డబ్బు విషయంలో నోరు మెదపాడని పోలీసు అధికారులు అంటున్నారు.
అనంతరం బెంగళూరు నగరంలోని ఆర్ ఆర్ నగర్ లోని ఐడియల్ హోమ్ లేఅవుట్ లోని దర్శన్ ఇంట్లో రూ. 40 లక్షలు స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారులు అంటున్నారు. డబ్బు స్వాధీనం చేసుకున్న సమయంలో ఇంట్లో హీరో దర్శన్ భార్య విజయలక్ష్మి ఉన్నారని పోలీసు అధికారులు అంటున్నారు. రేణుకాస్వామి హత్యకు ప్రధాన సూత్రధారి నటి, హీరో దర్శన్ గర్ల్ ఫ్రెండ్ పవిత్రా గౌడ అని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications