Bigg Boss 9 :బిగ్ బాస్‌లోకి బాలకృష్ణ హీరోయిన్ ఎంట్రీ
Bigg Boss 9 : ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ 9 తెలుగు గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ అంగరంగ వైభవంగా మొదలైంది. ఈ సీజన్‌లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్స్‌ను హోస్ట్ నాగార్జున గారు అత్యంత ఉత్సాహంగా స్వాగతించారు. ఈసారి బిగ్ బాస్ హౌస్‌లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులకూ చోటు కల్పించడం ఈ సీజన్‌కు ఒక కొత్త కలర్‌ను తీసుకొచ్చింది.
'అగ్ని పరీక్ష' దాటి వచ్చిన సామాన్యులు
ఈ సీజన్లో ప్రధాన హైలైట్లలో ఒకటైన అగ్ని పరీక్ష ద్వారా ఐదుగురు సామాన్య కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. మర్యాద మనీష్, ఆర్మీ పవన్ కళ్యాణ్, మాస్క్ మ్యాన్ హరీష్, దమ్ము శ్రీజ, మరియు ప్రియా శెట్టి ఇప్పటికే తమ స్థానాలను సుస్థిరం చేసుకున్నారు. వీరి ప్రవేశంతో బిగ్ బాస్ హౌస్‌లో సామాన్యుల సవాల్ మొదలైనట్లే అని చెప్పవచ్చు. తాజా సమాచారం ప్రకారం, మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి ప్రవేశించారు. సెలబ్రిటీలు మరియు సామాన్యుల కలయికతో ఈసారి పోటీ చాలా ఆసక్తికరంగా మారబోతుంది. ఇప్పటికే అగ్ని పరీక్ష ద్వారా వచ్చిన ఐదుగురు కంటెస్టెంట్స్‌తో పాటు మిగిలిన తొమ్మిది మంది ఎవరు, వారు హౌస్‌లో ఎలాంటి కంటెంట్‌ను అందిస్తారు అనేది ఈ సీజన్ ప్రేక్షకులకు అద్భుతమైన వినోదాన్ని అందించేలా ఉంది.

రెండో కంటెస్టెంట్‌గా
తొలి కంటెస్టెంట్‌గా తనూజ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. రెండో కంటెస్టెంట్‌గా హీరోయిన్ ఆశాషైనీ ఎంట్రీ ఇచ్చింది. ఆశాశైనీ తన కెరీర్లో అనేక తెలుగు సినిమాల్లో నటించారు. ముఖ్యంగా, ఆమె నందమూరి బాలకృష్ణ నటించిన 'నరసింహ నాయుడు', వెంకటేష్ నటించిన 'నువ్వు నాకు నచ్చావ్' వంటి విజయవంతమైన చిత్రాల్లో సహాయక పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆమె నటన, క్యూట్‌నెస్ కారణంగా అభిమానుల నుంచి మంచి ఆదరణ పొందారు.












Click it and Unblock the Notifications