బిగ్ బాస్ 8 నుంచి పొట్టి పిల్ల ఎలిమినేట్..!!

Bigg Boss Telugu 8: టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రసవత్తరంగా సాగుతోంది. ఏ మాత్రం ఊహించని కాంటెస్టెంట్లు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతున్నారు. ఇప్పటివరకు నలుగురు హౌస్ నుంచి బయటికొచ్చారు.

ఇప్పుడు తాజాగా ఈ లిస్ట్‌లో మహిళా కంటెస్టెంట్ జాయిన్ అయ్యారు. ఆమే- నైనిక అనసూరు. పొట్టిపిల్లగా బిగ్ బాస్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకూ సుపరిచితురాలైన నైనిక.. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఆమెకు అతి తక్కువగా ఓట్లు పోల్ కావడమే దీనికి కారణం.

Bigg Boss Telugu 8 Nainika eliminated from the house

ఇప్పటివరకు నలుగురు కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికొచ్చారు. ఎన్నో అంచనాలతో బిగ్ బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన బెజవాడ బేబక్క తొలి వారమే ఎలిమినేట్ అయ్యారు. ఆ తరువాతి వారంలో ఆర్జే శేఖర్ బాషా బయటికొచ్చారు. మూడో వారంలో అభయ్ నవీన్, నాలుగో వారంలో సోనియా ఆకుల ఎలిమినేషన్‌ను ఎదుర్కొన్నారు.

ఈ వారంలో ఇద్దరు బిగ్ బాస్ హౌస్‌మేట్స్ ఎలిమినేట్ కావడం అనూహ్యంగా మారింది. నటుడు ఆదిత్య ఓం ఎక్కువ రోజులు హౌస్‌లో ఉండలేకపోయాడు. మిడ్ వీక్ ఎలిమినేషన్‌ సందర్భంగా అతను బయటికి రావాల్సి వచ్చింది. తాజాగా నైనిక అనసూరు అదే బాట పట్టారు. హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.

అయిదు వారాల పాటు ఆమె హౌస్‌లో ఉన్నారు. దీనికోసం ఆమె అందుకున్న రెమ్యునరేషన్ సుమారు లక్ష నుంచి లక్షన్నర రూపాయల వరకు ఉంటోంది. ఈ అయిదు వారల్లో ఆమె ఆరు నుంచి ఏడు లక్షల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో యష్మీ, నిఖిల్, పృథ్వీరాజ్, మణికంఠ, విష్ణుప్రియ, ప్రేరణ, నబీల్, కిర్రాక్ సీత కొనసాగుతున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పాత కంటెస్టెంట్స్ వారికి జత కానున్నారు. హరి తేజ, రోహిణి, ముక్కు అవినాష్,, గంగవ్వ, మెహబూబ్, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, నయని పావని.. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ అవుతారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+