రామ్‌చరణ్-నాగార్జున-వెంకటేష్ కాంబోలో మిస్సయిన బ్లాక్ బస్టర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి దీన్ని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అలాగే కింగ్ నాగార్జున కుబేర, కూలి సినిమాల్లో నటిస్తున్నారు. కూలి సినిమాలో నాగార్జున ప్రతినాయకుడిగా నటిస్తుండటం విశేషం. ఆయనలో మరో కోణాన్ని సినీ ప్రియులకు లోకేష్ కనగరాజ్ పరిచయం చేయబోతున్నాడు. అలాగే విక్టరీ వెంకీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇది కూడా సంక్రాంతికే రానుంది.

జులాయిగా తిరిగే పాత్ర కావడంతో..
ఈ ముగ్గురు సూపర్ స్టార్ల కాంబినేషన్ లో ఓ భారీ మల్టీస్టారర్ సినిమా రావాల్సి ఉంది. అయితే క్యారెక్టర్ల పరంగా దర్శకుడు వీరందరికీ సెట్ అవదేమో అని ఆలోచించడంతో ఆ సినిమా మిస్సయింది. అది ఏ సినిమా అంటే కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన గోవిందుడు అందరివాడేలే. ఈ సినిమాలో శ్రీకాంత్ పోషించిన పాత్రకు వెంకటేష్ చేత వేయించాలనుకున్నారు. జలాయిగా తిరిగే పాత్ర కావడంతో వెంకీలాంటి సూపర్ స్టార్ కు అది సెట్ అవదని, కథ చెప్పిన తర్వాత కూడా కృష్ణ వంశీ వద్దన్నారు. అలాగే రామ్ చరణ్ తండ్రి పాత్రను నాగార్జున చేత వేయించాలని భావించి నాగ్ కు కథ చెప్పారు. అయితే ఆ సినిమాతో ఈ పాత్రకు అంత బలమైన స్కోప్ లేదు. దీంతో నాగార్జున చేత ఆ పాత్ర వేయిస్తే బాగుండదని కృష్ణవంశీ భావించారు.

Blockbuster movie in Ram Charan Nagarjuna and Venkatesh combination is missing

కృష్ణ ఆరోగ్యం సహకరిస్తుందా?
అలాగే ప్రకాష్ రాజ్ పాత్రను మాత్రం కృష్ణ చేతే వేయించాలని గట్టిగా అనుకున్నారు. సినిమాకు ప్రధాన బలం ఆ పాత్రే. అలాగే కృష్ణ అనారోగ్య పరిస్థితుల్లో ఈ పాత్రను పోషించగలరా? లేదా? ఆయనకు ఇబ్బంది అవుతుందేమో అని ఆలోచించి చివరకు ప్రకాష్ రాజ్ ను ఎన్నుకున్నారు. అప్పట్లోనే ఈ సినిమా భారీ బిజినెస్ జరుపుకుంది. థియేట్రికల్ హక్కులు రూ.50 కోట్లకు అమ్ముడుపోయాయి. చివరకు రూ.43 కోట్లే వచ్చాయి. సినిమా ఫ్లాప్ అన్నారు.. మరికొందరు ఎబో యావరేజ్ అన్నారు. ఏదేమైనప్పటికీ అనుకున్నస్థాయిలో అంచనాలను మాత్రం ఈ సినిమా అందుకోలేకపోయింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, కియారా అద్వానీ కథానాయికగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రమే గేమ్ ఛేంజర్. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ సగం జరిగిన తర్వాత మధ్యలో వదిలేసి దర్శకుడు శంకర్ భారతీయుడు2 చిత్రాన్ని తీశారు. దీనివల్ల ఆలస్యం కావడంతోపాటు ఆయన రెంటికీ చెడ్డ రేవడిలా తయారయ్యారు. భారతీయుడు2 చిత్రం భారతదేశంలోనే అతి పెద్ద భారీ డిజాస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

ఆశలు వదిలేసుకున్న అభిమానులు
దీంతో మెగా అభిమానులు గేమ్ ఛేంజర్ పై ఆశలు వదిలేసుకున్నారు. ఈ సినిమాకు సంబంధించి కేవలం ఒక పాటనే విడుదల చేశారు. ఈ సినిమాకు అటూ ఇటూగా మొదలుపెట్టిన దేవర ఈనెల 27వ తేదీన విడుదల కాబోతోంది. పుష్ప2 డిసెంబరు ఆరోతేదీన విడుదల కాబోతోంది. దేవరకు గ్రాఫిక్ వర్క్ ఎక్కువ కాబట్టి ఆలస్యమైందనుకోవచ్చు. అలాగే పుష్ప2 సన్నివేశాలకు దర్శకుడు సుకుమార్ రాజీపడకపోవడంతో మళ్లీ తీస్తున్నారు. దీనివల్ల ఆలస్యమైంది. కానీ గేమ్ ఛేంజర్ సింపుల్ సోషల్ స్టోరీ. దీనికి ఎందుకు అంత ఆలస్యమవుతుందో శంకర్ కే తెలియాలి.

ఒక్క ప్రమోషన్ కూడా లేదు
గేమ్ ఛేంజర్ సినిమా నుంచి జరగండి జరగండి అనే పాట తప్ప దీన్నుంచి ఒక్క ప్రమోషన్ కూడా లేదు. అసలు సినిమా విడుదలవుతుందా? లేదా? అని మెగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. సినిమాలో ఈ పాట తప్ప మరేమీ లేదనిపిస్తోందని, అలాగే సినిమాకు సంబంధించిన పెన్ డ్రైవ్ ను కూడా పోగొట్టారంటున్నారు. ఇందులో వాస్తవమెంతో నిర్మాత, దర్శకులకే తెలియాలి. దర్శకుడు శంకర్ తోపాటు నిర్మాత దిల్ రాజును ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో మెగా అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. దాదాపుగా మెగా అభిమానులు గేమ్ ఛేంజర్ పై ఆశలు వదిలేసుకున్నట్లేనని స్పష్టమవుతోంది. వారి ఆశలన్నీ బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోతున్న పెద్దిమీదే ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+