Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

16 ఏళ్ల కూతురికి సెక్స్ టాయ్ ను గిఫ్ట్ గా ఇచ్చిన హీరోయిన్..!

సాధారణంగా పిల్లలకు చాక్లెట్స్, బిస్కెట్స్, బుక్స్, పెన్స్ గిఫ్ట్ గా ఇస్తుంటారు పేరెంట్స్. అదే సెలబ్రిటీలు అయితే కాస్త విలువైన బహుమతులు ఇస్తారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం తన 16 ఏళ్ల కూతురికి ఊహించని గిఫ్ట్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. ఆమె వ్యాఖ్యలు వైరల్ కావడంతో నెటిజెన్లు హీరోయిన్ పై మండిపడుతున్నారు. ఛీ..ఛీ .. ఇదేం గిఫ్ట్.. కూతురికి ఎవరైనా ఇలాంటి బహుమతులు ఇస్తారా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..? ఆమె ఇచ్చిన గిఫ్ట్ ఏంటి..?

బాలీవుడ్ నటి గౌతమి కపూర్.. హీందీ చిత్రసీమలో అనేక సినిమాలు, సీరియల్స్, షోస్ లో నటించింది. గత 20 ఏళ్లుగా ఆమె బాలీవుడ్ లో కొనసాగుతోంది. ఆమె చేసిన చిత్రాల్లో ఘర్ ఏక్ మందిర్, క్యూంకీ సాస్ భీ కబీ బహూ తీ, గ్యారహ్ గ్యారహ్, ఫనా, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్.. చిత్రాలతో పేరు తెచ్చుకుంది. అయితే ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. తన 16 ఏళ్ల కూతురికి సెక్స్ టాయ్ ను గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు.

Bollywood actress Gautami Kapoor was seen gifting a sex toy to her daughter

హేటర్ ఫ్లై అనే వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతమి కపూర్ మాట్లాడుతూ.. " నా కుమార్తె 16వ బర్త్ డే రోజు నేను సెక్స్ టాయ్ కావాలా లేదా వైబ్రేటర్ కావాలా అని అడిగాను. అందుకు తాను అమ్మా.. మీ మైండ్ పనిచేయట్లేదా అని కోప్పడింది. ఎంతమంది తల్లులు ఇలా అడుగుతారు కూతుళ్లను. ఇంత ఫ్రీగా ఎవరు ఉంటారు. నేను అలాంటి గిఫ్ట్స్ ఎందుకు ఇవ్వకూడదు. నా తల్లి నాకు ఏదైతే నేర్పించలేకపోయిందో.. నేను అది నా కూతురికి ఎందుకు చెప్పకూడదు. ఇప్పుడు నా కుమార్తెకు 19 ఏళ్లు. నా మాటలను గౌరవిస్తోంది. నా మాటలను ఏకీభవిస్తోంది" అని గౌతమి కపూర్ చెప్పుకొచ్చింది.

ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఆమెపై నెటిజెన్లు విమర్శలు చేస్తున్నారు. కూతురిపట్ల మీ ఆలోచనలు ఇలా ఉన్నాయేంటని మండిపడుతున్నారు. అయితే మరికొంత మంది మాత్రం పిల్లలకు చిన్న వయసు నుంచే సెక్స్ ఎడ్యూకేషన్ చెప్పాలని అదే సరైన నిర్ణయం అని అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+