Janhvi Kapoor: ముంబై నుంచి హైదరాబాద్ మధురానగర్ కు జాన్వీ కపూర్..
బాలీవుడ్ నటి, శ్రీదేవి కూతురు జాన్వీకపూర్(Janhvi Kapoor) హైదరాబాద్ కు వచ్చారు. అయితే సినిమా షూటింగ్ లేదా ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం కోసం కాదు. మధురానగర్ పూజలు చేసేందుకు ముంబై నుంచి వచ్చారు. హనుమాన్ దేవాలయంలో జాన్వీ కపూర్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు జాన్వీ కపూర్ కు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆమెకు మొదటి నుంచి దేవుళ్లు అంటే భక్తి. అందుకే ఆమె ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి పూజలు చేశారు. మధురానగర్ ఆంజనేయస్వామి ఆలయానికి ఎందుకు వచ్చారు అనేది తెలియలేదు.
కాగా జాన్వీ కపూర్ మధురానగర్ ఆలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు అక్కడి భారీగా చేరుకున్నారు. ఆమెతో సెల్ఫీ దిగేందుకు ఎగపడ్డారు. జాన్వీ కపూర్ గతంలో చాలా సార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ మధ్య ఆమె తెలుగులో నటించిన దేవర(Devara) మూవీ భారీ విజయం సాధించింది. భారీ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీసు వద్ద పలు రికార్డులు సృష్టించింది. ఈ చిత్రంలో ఆమె నటన అందరిని మెప్పించింది. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు పెరిగాయి.

ప్రస్తుతం జాన్వీ కపూర్ గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ ఆర్సీ16 సినిమాలో నటిస్తున్నారు. ఇప్పుడు ఆమెకు మరో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఓ చిత్రం రీమేక్ లో ఆమె హీరోయిన్ గా ఆఫర్ కొట్టేసినట్లు వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. తమిళంలో హిట్ అయిన సినిమా ఈరం తెలుగులో రీమేక్ చేశారు. తెలుగులో వైశాలితో విడుదలైన సినిమా భారీ విజయం సాధించింది. ఇప్పుడు ఈ మూవీని హిందీలో రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేయనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications