అల్లు అర్జున్‌ని తొక్కేయాలని మెగా ఫ్యామిలీ చూస్తోంది..సంచలన ట్వీట్ లీక్
గత కొద్దికాలంగా మెగా వర్సెస్ అల్లు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయని అనేక కథనాలు వెలువడుతున్నాయి. దీనికి కారణం అల్లు అర్జున్ అనే విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. అప్పటి నుంచి మెగా ,అల్లు కుటుంబాల మధ్య మాటల్లేవనే చర్చ సాగుతోంది.పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నప్పటికి, లోలోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్టు కనిపిస్తోంది.
మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపించింది. మెగా ,అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఎన్నికల ఫలితాల సమయంలోనే హీరో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌ను బ్లాక్ చేశారనే ప్రచారం జరిగింది. ఇక ఇదే సమయంలో మెగా కుటుంబంలోని ఆడవారి మధ్య కూడా మాటల్లేవనే చర్చ జరిగింది. జులై 20న మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన పుట్టిన రోజు. లావణ్య త్రిపాఠి, నమ్రత శిరోద్కర్, తారక్ భార్య లక్ష్మి ప్రణతి పలువురు సెలబ్రిటీలు ఉపాసనకు బర్త్ డే విషెష్ చెప్పారు.

అయితే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి మాత్రం ఉపాసనకు బర్త్ డే విషెష్ చెప్పకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఇటు స్నేహారెడ్డి పుట్టిన రోజు నాడు కూడా మెగా ఫ్యామిలీ నుంచి ఆమెకు ఎవరూ విషెష్ చెప్పలేదు. దీంతో రెండు ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ సాగుతుందని అంతా భావిస్తున్నారు.దీనిపై ఇరువురు హీరోలు స్పందించలేదు.తాజాగా మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్‌నుతొక్కేయాలని చూస్తున్నారంటూ బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్. ఖాన్ (కేఆర్కే) సంచలన ట్వీట్ చేశాడు.
The proof of Mega family’s jealousy of @alluarjun is that none of the family member including @kchirutweets , @PawanKalyan , @AlwaysRamCharan @IamSaiDharamTej and @IAmVarunTej tweeted about the extraordinary trailer of #Pushpa2! But On December 5th, they will all cry in each… pic.twitter.com/Edv4udrQRi
— KRK (@kamaalrkhan) November 20, 2024
"చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ లాంటి యాక్టర్స్ తెలుగు సినిమా పరిశ్రమలో కుటుంబానికి చెందినవారు. వారంతా అల్లుఅర్జున్ ని అణిచివేసేందుకు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అయితే వారందరి కంటే అల్లు అర్జున్ ఒక్కడే పెద్ద సూపర్ స్టార్ అని అర్థం చేసుకోవాలి. 'పుష్ప 2' చిత్రం హిందీలో ₹50 కోట్లకి పైగా హిస్టారికల్ ఓపెనింగ్‌ను సాధించబోతోంది. ఇది చిరంజీవి ఫ్యామిలీకి హార్ట్ ఎటాక్ తెప్పిస్తుంది" అని కమల్ ఖాన్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.మెగా హీరోలను కించపరుస్తూ, అల్లు అర్జున్ స్టార్ డమ్ ను ఎలివేట్ చేస్తూ కమల్ ఆర్ ఖాన్ పెట్టిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.












Click it and Unblock the Notifications