బిగ్‌బాస్ సీజ‌న్ 8లోకి బ్ర‌హ్మ‌ముడి న‌టి కావ్య‌... ఇందులో వాస్త‌వ‌మెంతా.?

తెలుగు ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఆద‌రించేది మాటీవీలో ప్ర‌సార‌మ‌య్యే బిగ్ బాస్ షో. ఇక‌, బిగ్‌బాస్ సీజ‌న్ 8 త్వ‌ర‌లోనే ప్రారంభం అవుతుంద‌ని టాక్ న‌డుస్తోంది. ఇప్ప‌డు మ‌రో వార్త నెట్టంట తెగ వైర‌ల్ గా మారింది. అదేంటో కాదు. బిగ్‌బాస్ సీజ‌న్‌లోకి ఈ సారి బ్ర‌హ్మ‌ముడి న‌టి కావ్య రాబోతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలుగు రియాలిటీ షోల‌లో బిగ్‌బాస్‌కు ఉండే ప్ర‌త్యేక‌త వేరు. ఇందులో ఎంతోమంది సెల‌బ్రిటీలు పాల్గొంటారు. వారి వ్య‌క్తిగత జీవితాల‌ను ఇందులో తెలుసుకునే అవ‌కాశం ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ 7 విజ‌య‌వంతం కావడంతో సీజన్ 8 గురించి కూడా ఆడియెన్స్‌లో మ‌రింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్స్‌గా కనిపించే వారిపై వీప‌రీత‌మైన ఫోకస్ పెరిగింది. నెట్టింట్లో ఇప్పటికే ఇందులో కంటెస్టెంట్స్ వీరే అంటూ కొందరి పేర్లు తెరపైకి వ‌స్తున్నాయి. అందులో బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ న‌టి కావ్య పేరు తెగ వినిపిస్తోంది. ఇక‌, ఈ న్యూస్ కూడా సోష‌ల్‌మీడియాలో తెగ ప్ర‌చారమ‌వుతుంది.

మాటీవీలో ప్ర‌సార‌మ‌వుతున్న బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ న‌టి కావ్య అస‌లు పేరు దీపికా రంగరాజ్. ఈమె క‌న్న‌డ న‌టి. దీపికా ముందుగా 'చిత్రం పేసుతాడి' అనే తమిళ సీరియల్‌తో హీరోయిన్‌గా తన సినీ ప్ర‌స్థానాన్ని మొద‌లుపెట్టింది. ఆ సీరియ‌ల్ ముగిసే స‌మ‌యానికే దీపికాకు తెలుగులో బ్ర‌హ్మ‌ముడీ సీరియ‌ల్ ఆఫ‌ర్ వ‌చ్చింది. ఈ సీరియ‌ల్ ప్రారంభం నుంచే న‌టి దీపిక‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇందులో అచ్చ‌తెలుగు ఆడ‌పిల్ల‌ల క‌నిపించే కావ్య న‌ట‌న తెలుగు ఆడియెన్స్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. సీరియ‌ల్ హీరో మాన‌స్ స‌ర‌స‌న దీపికా న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. ఇక‌, ఈ న‌టి మాటీవీలో ప్ర‌సార‌మ‌య్యే ప‌లు షోలలో కూడా పాల్గొంది. అందులో దీపికా చేసే అల్ల‌రి, కామెడీ టైమింగ్ అంతా ఇంతా కాదు. ఇక‌, మాన‌స్ తో త‌ను చేసే అల్ల‌రీ మాములుగా ఉండ‌దు. దీంతో ఈ న‌టికి బ‌య‌ట కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది.

Brahmamudi actress Kavya enters Bigg Boss season 8 Is this all true

నన్ను బిగ్ బాస్‌కు పంపిస్తారా..?

అయితే, ఇటీవ‌లే దీపికా మాటీవీలో ప్ర‌సార‌మయ్యే ఓ టీవీ షో లో పాల్గొన్నారు. అందులో షో యాంక‌ర్ శ్రీ‌ముఖి దీపికా గురించి ఓ ఇంట్ర‌స్టెంగ్ కామెంట్స్ చేశారు. దాంతో ఆ న్యూస్ కాస్త ఇప్ప‌డు నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. షోలో పాల్గొన్న దీపికాతో శ్రీ‌ముఖి నిన్ను మ‌రో మూడు నెలల పాటు షోకు రానివ్వము అని అంది. దాంతో వెంట‌నే దీపికా ఏంటీ నన్ను బిగ్ బాస్‌కు పంపిస్తారా అంటూ ప్రశ్నించింది. దీంతో తను నిజంగానే బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతంద‌నే న్యూస్ నెట్టంట హాల్‌చ‌ల్ చేస్తోంది. అయితే, ఈ షో చూసిన చాలామంది నెటిజ‌న్లు కూడా దీపికా ఈ సారి బిగ్‌బాస్ సీజ‌న్‌లో పార్టిస్‌పేట్ చేస్తుందేమోన‌ని తెగ మురిసిపోతున్నారు. అయితే, ఈ విష‌యంపై అటు దీపికా గానీ, బిగ్‌బాస్ మేక‌ర్స్ గానీ అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. కాబ‌ట్టి ఈ వార్త‌లో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే మ‌రికొన్ని రోజులు వేచి చూడాల్సిందే...!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+