బాలయ్య 50 ఏళ్ల సినీ వేడుకకు హాజరుకాని స్టార్ హీరోలు

నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ పరిశ్రమలోకి ప్రవేశించి ఆగస్టు 30వ తేదీకి 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్నారు. ఇటువంటి అరుదైన సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగు పరిశ్రమ ఆధ్వర్యంలో బాలయ్య స్వర్ణోత్సవ సంబరాలను హైదరాబాద్ నోవాటెల్ లో ఘనంగా జరిపారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. బాలయ్య మరో 100 సంవత్సరాలు ఇలాగే సినిమాల్లో నటించాలని, వైద్యరంగంతోపాటు ఎమ్మెల్యేగా కూడా సేవలందించాలని ప్రముఖులంతా అభిలషించారు.

వేడుకకు హాజరైనవారు
చిరంజీవి, వెంకటేష్, నాని, రానా, సిద్ధు జొన్నలగడ్డ, అడవి శేష్ తోపాటు ఉపేంద్ర, శివరాజ్ కుమార్, దగ్గుబాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరి, అల్లు అరవింద్, అశ్వనీదత్, బ్రహ్మానందం, విజయ్ దేవరకొండ, మురళీమోహన్, క్రిష్, పి.వాసు, ఎస్.వి.కృష్ణారెడ్డి, శ్రీకాంత్, దిల్ రాజు, విజయేంద్రప్రసాద్, వైవీఎస్ చౌదరి, బుచ్చిబాబు, గోపీచంద్ బలినేని, మంచు విష్ణు, మంచు మనోజ్, రాజశేఖర్, సుమలత, జయసుధ, అల్లరి నరేష్, తమన్, అంబికా కృష్ణ, శివకృష్ణ. సి.కల్యాణ్ తదితర ప్రముఖులంతా పాల్గొన్నారు.

Celebrities who did not attend Balayya s golden jubilee celebrations

వేడుకకు హాజరుకానివారు
ఈ కార్యక్రమానికి అక్కినేని నాగార్జున హాజరు కాలేదు. అలాగే ఆయన తనయులు అక్కినేని నాగచైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్, యార్లగడ్డ సుప్రియలాంటివారంతా దూరంగా ఉన్నారు. నాగార్జునకు ప్రత్యేక ఆహ్వానం అందింది. తప్పనిసరిగా హాజరవుతారనుకున్నప్పటికీ అందరికీ షాక్ ఇచ్చారు. నందమూరి వారసులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కూడా హాజరు కాలేదు. తారక్ కర్ణాటక వెళ్లగా, కల్యాణ్ రామ్ బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయినట్లు సమాచారం. అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు, కూడా హాజరు కాలేదు.

ముఖ్యమంత్రి తరఫున కందుల దుర్గేష్
అలాగే ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డి వరద సహాయక కార్యక్రమాల్లో ఉండి హాజరుకాలేదు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, నారా లోకేష్ కూడా వరద సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తుండటంతో రాలేదు. ముఖ్యమంత్రి తరఫున సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+