కూతురిని చూడాలని కోరినా చిరంజీవి పంపించలేదు: శిరీష్ భరద్వాజ్ తల్లి
మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు, తన కుమారుడు శిరీష్ భరద్వాజ్ తాగుడుకు బానిసై మరణించినట్లు వస్తున్న వార్తలను శిరీష్ తల్లి ఖండించారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో పలు విశేషాలను పంచుకున్నారు. అందరూ తాగుతున్నట్లుగా తాగేవాడే కానీ ఎప్పుడూ బాధతో ఎక్కువ తాగలేదని తెలిపింది. చనిపోవడానికి నెలరోజుల ముందు కూడా బాగానే ఉన్నాడని, లివర్, లంగ్స్ పాడవడంతో మరణించారని అందరూ అనుకుంటున్నారని, కానీ గుండెపోటుతో మృతిచెందినట్లు వెల్లడించింది.
దుబాయ్ నుంచి వచ్చిన తర్వాతే
దుబాయ్ లో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడని, అక్కడి నుంచి వచ్చిన తర్వాతే ఆరోగ్యం పాడైందని శిరీష్ తల్లి చెప్పింది. జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడని, నెలరోజులపాటు ఆసుపత్రిలోనే ఉన్నాడని, కార్డియాక్ అరెస్ట్ హఠాత్తుగా జరగడంతో మరణించినట్లు శిరీష్ తల్లి వివరించారు. చెన్నైలో చికిత్స తీసుకున్నాడంటూ వస్తున్న వార్తలు సరికావని ఖండించారు.

వారు పంపించడంలేదు
శిరీష్ కు తన కూతురు నివృతి అంటే ఎంతో ఇష్టమని, కానీ ఆ పాప శ్రీజ దగ్గరే ఉంటోందని, చూపించమని చాలాసార్లు అడిగినప్పటికీ చిరంజీవి కుటుంబ సభ్యులెవరూ చూపించలేదని, వారంతా పెద్దవాళ్లు కదా అని వ్యాఖ్యానించింది. ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా కూతురును చూడాలని ఉందని శిరీష్ అడిగాడని, తెలిసినవారితో మెగా ఫ్యామిలీని అడిగినప్పటికీ వాళ్లు పంపించలేదని తెలిపింది. దీంతో తన కొడుకు ఎంతో బాధపడ్డాడని, నివృతి అంటే తన కొడుకుకు ఎంతో ఇష్టమని, ఏ తండ్రి అయినా కూతురును దూరం చేసుకోవాలని అనుకోరని చెప్పింది.
ఆ పాప తమ వంశం
నివృతి తమ వంశమని, తమ పాప అని, తన మొదటి మనవరాలు అని, తనకు కూడా చూడాలని ఎంతో ఉంటుందికానీ పంపించడంలేదని చెప్పింది. పాపను కలిస్తే మీ నాన్న ఈయనే అని, తాను నానమ్మను అవుతానని, ఇది మన కుటుంబం అని చెపుతానంది. శిరీష్, శ్రీజ విడిపోవడానికి సంబంధించిన కారణాలు తనకు గుర్తులేవని, చాలా సంవత్సరాలు అయిందికదా అంటూ శ్రీజను కొనియాడింది. చాలా ఇన్నోసెంట్ అని, అందరితో బాగుండేదని చెప్పింది.












Click it and Unblock the Notifications