'కాకా' మూవీపై లీక్ ఇచ్చిన చిరంజీవి.. సోషల్ మీడియా షేక్

మెగాస్టార్ చిరంజీవి ఏడు పదుల వయసులోనూ ఇండస్ట్రీ హిట్స్ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వర ప్రసాద్ గారు చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు చిరంజీవి. ఈ మూవీ దాదాపు రూ. 350 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. మెగాస్టార్ కెరీర్ లోనే అత్యధిక వసూల్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఆ మూవీ ఇచ్చిన జోష్ తో ప్రస్తుతం విశ్వంభర, కాకా అనే సినిమాలను చేస్తున్నారు.

ఇక విశ్వంభర మూవీ రిలీజ్ పై ఇంకా క్లారిటీ లేదు. అయితే కాకా చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక 'వాల్తేరు వీరయ్య' లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత చిరంజీవి, బాబీ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో కాకా పై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే అంచనాలకు తగ్గట్టుగానే మంచి కమర్షియల్ వాల్యూస్ తో డైరెక్టర్ బాబీ దీన్ని తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం అందుతోంది.

ఇక ఈ మూవీలో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ చిరంజీవి కుమార్తెగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ ​పై వెంకట్ కే. నారాయణ నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఆడియో ఫంక్షన్ లో పాల్గొన్న చిరంజీవి.. సినిమాలోని అనస్వర రాజన్ క్యారెక్టర్ ​పై హింట్ ఇచ్చారు. అది కాస్తా ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కాకా సినిమాలో అనస్వర రాజన్ నటన అద్భుతంగా ఉంటుందని అన్నారు.

Chiranjeevi reveals secret about Kaaka makes significant comments that going viral social media

కాకా చిత్రంలో అనస్వర నటన అద్భుతంగా ఉంటుంది. 'అనస్వర నీ పాత్ర గురించి ఏమైనా మాట్లాడతావా..? కానీ తను మాట్లాడదు, మాట్లాడలేదు.. నేను చెప్పిన ఈ మాటను ఇంటికి వెళ్లాక కాస్త ఆలోచించండి' అంటూ చిరంజీవి హింట్ ఇచ్చారు. దాంతో సినిమాలో అనస్వర మూగ అమ్మాయి పాత్రలో నటిస్తుందని టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా కాకా మూవీ రిలీజ్ అయ్యాకే దీనిపై స్పష్టత రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+