మహేష్ బాబుకు బిగ్ షాక్.. ఎంక్వైరీకి పిలుపు !

సూపర్ స్టార్ మహేష్ బాబు చిక్కుల్లో పడ్డారు. ఓ రియల్ ఎస్టేట్ మోసం కేసులో ఆయనకు వినియోగదారుల కమిషన్ షాక్ ఇచ్చింది. ఆయన ప్రచారకర్తగా వ్యవహరించిన రియల్ ఎస్టేట్ సంస్థపై ఓ వైద్యురాలు సహా మరో బాధితుడు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే కమిషన్ ఈ కేసులో నోటీసులు జారీ చేస్తూ నేడు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వైద్యురాలు, మరో వ్యక్తి కలిసి 'మెస్సర్స్ సాయి సూర్య డెవలపర్స్' అనే సంస్థపై వినియోగదారుల కమిషన్‌ కు ఫిర్యాదు చేశారు. బాలాపూర్ గ్రామంలో ఆ సంస్థ వేసిన వెంచర్‌లో చెరో ప్లాట్‌ కొనుగోలు చేసేందుకు రూ. 34.80 లక్షలు చెల్లించినట్లు వారు తమ ఫిర్యాదులో తెలిపారు.

consumer-commission-notice-to-mahesh-babu-over-real-estate-issue

సదరు సంస్థకు మహేశ్ బాబు ప్రచారకర్తగా ఉన్నారని, ఆయన ఫొటోతో ఉన్న బ్రోచర్‌ చూసే ముందడుగు వేసినట్టు స్పష్టం చేస్తున్నారు. అలానే ఆకర్షణీయమైన హామీలు, అన్ని అనుమతులు ఉన్నాయన్న మాటలు నమ్మి తాము డబ్బు చెల్లించామని బాధితులు పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత అక్కడ ఎలాంటి లేఅవుట్ లేదని తెలుసుకుని, తాము మోసపోయామని గ్రహించామని వెల్లడించారు. తమ డబ్బును తిరిగి ఇవ్వాలని సంస్థ యజమాని కంచర్ల సతీశ్‌ చంద్రగుప్తాను కోరినట్టు పేర్కొన్నారు. అందుకు గాను ఆయన అతికష్టం మీద వాయిదాల పద్ధతిలో కేవలం రూ. 15 లక్షలు మాత్రమే తిరిగిచ్చారని వాపోయారు. మిగిలిన డబ్బు కోసం ఒత్తిడి చేయగా, యజమాని ముఖం చాటేయడంతో బాధితులు కమిషన్‌ను ఆశ్రయించామని అంటున్నారు.

ఈ క్రమంలోనే సంస్థను మొదటి ప్రతివాదిగా, సంస్థ యజమాని కంచర్ల సతీష్ చంద్రగుప్తాను రెండో ప్రతివాదిగా.. సంస్థకు ప్రచారం చేసిన మహేష్ బాబును మూడో ప్రతివాదిగా కంప్లైంట్ చేశారు. మహేష్ బాబు ఫొటోను వాడి, ఆకర్షణీయమైన హామీలతో ప్రజలను మభ్యపెట్టినట్టు వారు ఆరోపిస్తున్నారు. ప్రచారకర్తగా ఉన్న వ్యక్తికి కూడా నైతికంగా, న్యాయపరంగా బాధ్యత ఉందంటూ కమిషన్ ముందు వాదన వినిపిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

మరోవైపు మహేష్ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇంత వరకు ఏ అప్డేట్ ని అధికారికంగా మూవీ యూనిట్ రిలీజ్ చేయలేదు. అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయకుండానే సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఈ మూవీలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా నటిస్తున్నారు. SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+