'కూలీ' రివ్యూ: ఇది అసలు ఊహించలేదుగా..!

సూపర్ స్టార్ రజనీకాంత్ ,లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన 'కూలీ' సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. రజనీకాంత్ తన స్టైల్, డైలాగ్‌లతో, లోకేష్ తన యాక్షన్ ఓరియెంటెడ్ కథనాలతో ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఫలితం ఎలా ఉందో ఈ సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

కథ:
పోర్టులో అక్రమ దందాలు నిర్వహిస్తూ మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతుంటాడు సైమన్ (నాగార్జున). అతడికి దయాల్ (సౌబీన్ షాహిర్) నమ్మకస్తుడైన చేతిగా ఉంటాడు. సైమన్ అక్రమ వ్యాపారాలను చేధించడానికి పోలీసులు అండర్‌కవర్ ఆపరేషన్ చేస్తుంటారు. కానీ అండర్‌కవర్ ఆఫీసర్లను దయాల్ చంపేస్తుంటాడు. ఈ క్రమంలోనే దయాల్.. రాజశేఖర్ (సత్యరాజ్) అనే వ్యక్తిని చంపేస్తాడు. అయితే రాజశేఖర్ కూతురు ప్రీతీ (శృతిహాసన్) సహా ఇద్దరు చెల్లెళ్లకు ఆపద అని తెలుసుకున్న రాజశేఖర్ స్నేహితుడు దేవా (రజనీకాంత్) రంగంలోకి దిగుతాడు. అయితే సైమన్ అక్రమ వ్యాపారాలు ఏంటి? సైమన్, దేవాకు మధ్య ఉన్న వైరం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.

Coolie Review Rajinikanth s Vintage Swag Saves Lokesh Kanagaraj s Underwhelming Spy Thriller

విశ్లేషణ:
లోకేష్ కనకరాజ్ సినిమా అంటేనే మాఫియా, డ్రగ్స్, అక్రమ వ్యాపారాలు చుట్టూ కథ ఉంటుంది. అయితే అందరిలో ఉన్న అభిప్రాయానికి తగినట్లుగానే లోకేష్ ఈ కథను కూడా రాసుకున్నారు. కానీ రొటీన్ కథ.అయినప్పటికీ సినిమాను తనదైనశైలిలో తెరకెక్కించడంలో లోకేష్ కనకరాజ్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

నటీనటుల నటన:
రజనీకాంత్ తనదైన స్టైల్, నటనతో సినిమాకు ప్రాణం పోశారు. ఆయన చరిష్మా, డైలాగ్స్ ఫ్యాన్స్‌ను అలరిస్తాయి. నాగార్జున విలన్ పాత్రలో కనిపించినప్పటికీ, ఆ పాత్ర అంతగా ఆకట్టుకోలేకపోయింది. నాగార్జున వంటి స్టార్ ఇలాంటి పాత్ర చేయాల్సిన అవసరం ఉందా అనిపిస్తుంది. అయితే ఈ సినిమాకు హైలైట్ మాత్రం దయాల్ పాత్రలో సౌబీన్ షాహిర్. ఈ సినిమా భారాన్ని తన భుజాలపై మోశారు. తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించారు. శృతిహాసన్, సత్యరాజ్, ఉపేంద్ర, అమీర్ ఖాన్ వంటి నటీనటులు తమ పాత్రల పరిధిలో నటించారు.

సాంకేతిక అంశాలు:
ఈ సినిమాకు అత్యంత బలం అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. చాలా సన్నివేశాలకు తన సంగీతంతో ప్రాణం పోశారు. ముఖ్యంగా రజనీకాంత్ సీన్లకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఫ్యాన్స్‌తో కేకలు వేయిస్తుంది. సినిమాటోగ్రఫీ ,యాక్షన్ కొరియోగ్రఫీ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. కానీ బలహీనమైన కథనం, నెమ్మదిగా సాగే కథనం సినిమాను ఒక దశలో ప్రేక్షకులకు పరీక్షగా మారుస్తుంది. ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా ఉన్నతంగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:
రజనీకాంత్ చరిష్మా
సౌబీన్ షాహిర్ నటన
అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
యాక్షన్ సన్నివేశాలు

మైనస్ పాయింట్స్:
బలహీనమైన కథ
నెమ్మదిగా సాగే కథనం
నాగార్జున పాత్ర
మొత్తంగా'కూలీ' రజనీకాంత్ అభిమానులకు, యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారికి ఒకసారి చూడదగిన సినిమా.

రేటింగ్: 3/5

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+