స్టార్ హీరోయిన్ ప్రేమలో అర్ష్‌దీప్ సింగ్!
టీమిండియా యువ పేసర్, యార్కర్ల కింగ్ అర్ష్‌దీప్ సింగ్ ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్లో తన అద్భుతమైన బౌలింగ్ తో మైదానంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. అయితే అర్ష్‌దీప్ సింగ్ కేవలం ఆటతో మాత్రమే కాకుండా తన వ్యక్తిగత జీవితం కారణంగా కూడా వార్తల్లో నిలుస్తున్నాడు. అర్ష్‌దీప్ సింగ్ ఓ పంజాబీ ముద్దుగుమ్మతో ప్రేమలో ఉన్నాడని.. వీరిద్దరూ త్వరలోనే ఓ ఇంటి వారు కాబోతున్నారనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.
ఎవరా పంజాబీ హసీనా?
అర్ష్‌దీప్ సింగ్ ప్రముఖ పంజాబీ నటి, మోడల్ సమ్రీన్ కౌర్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం. సమ్రీన్ కౌర్ ఐపీఎల్ మ్యాచ్‌ల్లో అర్ష్‌దీప్‌ను ఉత్సాహపరచడానికి తరచుగా స్టేడియంలో కనిపిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆమె పంజాబ్ కింగ్స్ జట్టు సభ్యులతో కలిసి కూడా పలు సందర్భాల్లో కనిపించడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. తాజాగా వీరిద్దరూ జంటగా కనిపించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

వైరల్ అవుతున్న వీడియో.. కన్ఫర్మ్ అయినట్టేనా?
ఈ ప్రేమ వార్తల మధ్య, అర్ష్‌దీప్ సింగ్, సమ్రీన్ కౌర్ కలిసి ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వీరిద్దరూ ఒకరి చేతిని ఒకరు పట్టుకుని నడుస్తూ కనిపించారు. వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. "పర్ఫెక్ట్ కపుల్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చేతులు పట్టుకుని బహిరంగంగా కనిపించడంతో, వీరిద్దరూ తమ రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ధ్రువీకరించినట్లేనని అభిమానులు భావిస్తున్నారు.
`
సమ్రీన్ కౌర్ కెరీర్
సమ్రీన్ కౌర్ పంజాబీ చిత్ర పరిశ్రమలో గుర్తింపు పొందిన నటి. ఆమె జమ్మూ కాశ్మీర్‌లో పుట్టి పెరిగినప్పటికీ.. పంజాబీ సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. సమ్రీన్ కేవలం పంజాబీ సినిమాలకే పరిమితం కాకుండా, కపిల్ దేవ్ బయోపిక్ '83' లో కూడా నటించింది. అంతేకాకుండా పాపులర్ సింగర్స్ గురు రంధావా, బాద్‌షా వంటి స్టార్ల మ్యూజిక్ వీడియోల్లో కూడా ఆమె మెరిసింది. అద్భుతమైన గ్లామర్, ప్రతిభ ఉన్న సమ్రీన్.. ఇప్పుడు అర్ష్‌దీప్ సింగ్ మనసును గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తోంది












Click it and Unblock the Notifications