బాలకష్ణ ఫ్యాన్స్ ఫైర్..అతని వల్లే ఆగం అయిందంటూ ఆగ్రహం

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' సినిమా సంక్రాంతి కానుకగా ఆదివారం( జనవరి 12)న ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ లభిస్తోంది. డాకు మహారాజ్ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపించారని అభిమానులు చెబుతున్నారు.ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ మెప్పస్తుందని అంటున్నారు. బాలయ్య ఇమేజ్ కి తగ్గట్లు డైలాగ్, మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ దర్శకుడు బాబీ కొల్లి రూపొందించాడట. యాక్షన్ ఎపిసోడ్స్, బాలయ్య క్యారెక్టరైజేషన్ బాగున్నాయని చెబుతున్నారు.ఇంటర్వెల్ బ్యాంగ్ సైతం మెప్పించే అంశం అంటున్నారు.

కానీ సెకండ్ హాఫ్ డల్‌గా ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బాలకృష్ణ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారని తెలుస్తోంది. ఆయన యాక్షన్ సీన్స్, డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉన్నాయని అభిమానులు చెబుతున్నారు. బాబీ డియోల్ తన పాత్రలో చాలా బాగా నటించారట. ఆయన మరియు బాలకృష్ణ మధ్య వచ్చే క్లాష్ చాలా బాగుందని కామెంట్ చేస్తున్నారు. సినిమాలో యాక్షన్ సీన్స్ మంచి రెస్పన్స్ లభిస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ చాలా అద్భుతంగా ఉంటుంది. తమన్ సంగీతం చాలా బాగుందని, పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత బలం చేకూర్చాయని సినిమా చూసిన వారు చెబుతున్నారు.

Daku Maharaj movie stopped because of the music given by Taman

తాజాగా ఓ అభిమాని సినిమా గురించి స్పందించారు.తమన్ కారణంగా సినిమా ఆగిపోయిందని ఓ అభిమాని తెలిపారు.తమన్ అందించిన సంగీతం వల్ల సినిమా మధ్యలో సౌండ్ బాక్సులు పని చేయలేదని సదరు అభిమాని సరాదాగా స్పందించాడు. సినిమా ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి ప్రదర్శించాలని, లేని పక్షంలో మొదటి నుంచి ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాలయ్య అభిమానులను మెప్పిస్తుంది. అఖండ వారసత్వాని.. మరోసారి బాలయ్య తనపై పెట్టుకున్న నమ్మకాన్ని తమన్ నిలబెట్టుకున్నాడు. సినిమాకు సెకండ్ హీరో ఎవరైన ఉంటే అది కచ్చింతంగా తమన్ అనే చెబుతున్నారు. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతుల హీరోయిన్లుగా నటించగా, బాబీ డియేల్ విలన్‌ పాత్రలో నటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+