'హరిహర వీరమల్లు' కోసం చంద్రబాబుకు పవన్ స్పెషల్ రిక్వెస్ట్..!!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడు తన సినిమా హరి హర వీరమల్లు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తన సినిమాల కోసం పవన్ ఈ మూవీ ప్రమోషన్ కు ఎక్కువగా సమయం కేటాయిస్తున్నారు. విశాఖలో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొంటున్నారు. ఇక, ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ కూడా తీసుకోని పవన్.. చిత్రం విడుదల వేళ నేరుగా ఏపీ సీఎం చంద్రబాబుకు స్పెషల్ రిక్వెస్ట్ చేసారు. తానే స్వయంగా ఇందు కోసం ఫైల్ పంపారు.
డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత పవన్ తొలి సినిమా విడుదలకు రంగం సిద్దం అయింది. అనేక అవరోధాలను అధిగమించిన హరి హర వీరమల్లు సినిమా ఈ నెల 24న ఫ్యాన్స్ పండుగ వాతావరణంలో విడుదల కానుంది. కాగా, పవన్ ఈ సినిమా ప్రమోషన్ ను తన భుజ స్కందాల పైన వేసుకున్నారు. అదే విధంగా నిర్మాత కష్టాల గురించి పదే పదే ప్రస్తావన చేస్తున్న పవన్.. ఈ సినిమా కోసం తానే స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబుకు ఒక ఫైల్ ప్రతిపాదన చేసారు. ఈ విషయాన్ని స్వయంగా పవన్ వెల్లడించారు. హరిహర వీరమల్లు టికెట్ ధర పెంచేందుకు అనుమతిచ్చిన ఏపీ, తెలంగాణ సీఎంలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదే సమయంలో మరో కీలక అంశం పవన్ వెల్లడించారు. ఏపీలో సినిమాటోగ్రఫీ శాఖ జనసేన పార్టీ మంత్రి దగ్గరే ఉన్నందున టికెట్ ధర పెంపు దస్త్రాన్ని ఆయనకు కాకుండా నేరుగా ముఖ్యమంత్రి వద్దకు తానే పంపానని చెప్పారు. ఆయన నుంచే అనుమతి వచ్చిందని, ఇతర సినిమాలకు ఇచ్చినట్లే అనుమతిచ్చారని పవన్ కల్యాణ్ వెల్లడించారు.
సినిమా నిర్మాత కోసం తాను ప్రమోషన్ చేయటం నైతిక బాధ్యతగా భావించానని చెప్పుకొచ్చారు. అదే విధంగా ఏపీలో కూటమి నేతల కోసం ప్రత్యేకంగా హరిహర వీరమల్లు షో ఏర్పాటు చేయిస్తానని ప్రకటించారు. మూడు పార్టీల్లోని అందరి కోసం ప్రత్యేకంగా సినిమా ప్రదర్శన ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక, జనసేన శ్రేణులు ఈ సినిమా విడుదల వేళ తమ అభిమానం చాటుకుంటూ హంగామాకు సిద్దం అయ్యారు.
-
విడుదల వేళ.. ఉస్తాద్ షాకింగ్ డెసిషన్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
Pawan kalyan vs Ranveer Singh:ఉస్తాద్ వర్సెస్ ధురందర్..హ్యాట్రిక్ పోరులో గెలుపెవరిది? -
హీరోయిన్ కు పవన్ కల్యాణ్ రాజకీయ ఆఫర్.. ఏం జరిగిందంటే..? -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
అమరావతిలో తొలి భారీశిల్పం,చారిత్రక స్మారకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు! -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ఏపీకి ఈ బెనిఫిట్.. ఫోకస్ చెయ్యమన్న సీఎం చంద్రబాబు -
రాజమండ్రి పరిసరాల్లో "పెద్ద పులి".. హనుమాన్ బృందాలకు పవన్ కీలక ఆదేశాలు !! -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications