7.5 గంటల సినిమా? ఇండియన్ సినీ హిస్టరీలో బిగ్గెస్ట్ ఎక్స్‌పెరిమెంట్!

భారతీయ సినీ హిస్టరీలో మునుపెన్నడూ లేని విధంగా ఓ మైండ్ బ్లోయింగ్ ప్రయోగం జరగబోతోంది. బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన 'ధురందర్' ఫ్రాంచైజీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. దాదాపు 7 గంటల 30 నిమిషాల నిడివి గల ఓ భారీ సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్రబృందం కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం.

రెండు భాగాలు.. ఒకే సినిమాగా!
ఇటీవలే బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించిన 'ధురందర్' (పార్ట్ 1), దాని సీక్వెల్ 'ధురందర్ 2: ది రివెంజ్' సినిమాలను కలిపి ఒకే చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం భావిస్తోంది. 'ధురందర్: డైరెక్టర్స్ కట్' పేరుతో విడుదల కానున్న ఈ వెర్షన్ మొత్తం నిడివి సుమారు 7.5 గంటలు ఉండబోతోంది. సాధారణంగా భారతీయ సినిమాలు 3 గంటల లోపే ఉంటాయి. కానీ ఈ సినిమా రెండు భాగాలను ఏకధాటిగా చూసే అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ భారీ నిడివిని ఖరారు చేసినట్లు సమాచారం.

Dhurandhar Directors Cut 7 5 Hours Long Movie to Hit IMAX Screens A Bold Experiment

ప్రేక్షకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
ఒకే చోటు కూర్చుని దాదాపు ఏడున్నర గంటల సినిమా చూడటం ప్రేక్షకులకు ఓ సవాలుతో కూడుకున్న పని. అందుకే థియేటర్ల యాజమాన్యం, చిత్ర యూనిట్ కొన్ని ప్రత్యేక ప్లాన్లను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ సుదర్ఘ ప్రదర్శనలో మూడు ఇంటర్వెల్స్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనివల్ల ప్రేక్షకులు ఆహారం తీసుకోవడానికి లేదా కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి వీలు కలుగుతుంది. ఇదొక సినిమా ప్రదర్శనలా కాకుండా ఓ పండుగ లేదా ఈవెంట్ లాగా నిర్వహించేలా సినిమా యూనిట్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

ప్రీమియం స్క్రీన్లలోనే ప్రదర్శన
ఈ భారీ సినిమాను అన్ని థియేటర్లలో కాకుండా, కేవలం ఎంపిక చేసిన IMAX, HDR, EPIQ వంటి ప్రీమియం స్క్రీన్లలోనే విడుదల చేసే అవకాశం ఉంది. వీక్షించే అనుభూతి అత్యున్నత స్థాయిలో ఉంటేనే ఇంత నిడివి గల సినిమాను ప్రేక్షకులు ఆస్వాదించగలరని సినీ మేకర్స్ నమ్ముతున్నారు. అంతేకాకుండా రోజు మొత్తం ఒకే సినిమాకు కేటాయించాల్సి రావడంతో కేవలం వీకెండ్స్‌లో లేదా రోజుకు ఒకే ఒక స్పెషల్ షో చొప్పున ప్రదర్శించేలా చర్చలు జరుగుతున్నాయి.

బాక్సాఫీస్ వసూళ్లు ఇళా..
'ధురందర్' ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇందులో రణవీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా వంటి దిగ్గజ నటులు నటించారు. ఇప్పటికే 'ధురందర్ 2' ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 1400 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, హార్డ్ కోర్ సినిమా ప్రేమికుల కోసం ఈ స్పెషల్ వెర్షన్‌ను ఏప్రిల్ 5, 2026న విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఏప్రిల్ ఫూల్స్ డే వార్త కావచ్చు!
అయితే ఈ వార్తపై ఓ చిన్న అనుమానం కూడా నెలకొంది. నేడు ఏప్రిల్ 1 (ఏప్రిల్ ఫూల్స్ డే) కావడంతో, నెటిజన్లు లేదా మేకర్స్ సరదాగా ఈ వార్తను పుట్టించారా? అనే చర్చ కూడా జరుగుతోంది. ఇంతవరకు చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం భారతీయ చలనచిత్ర రంగంలో ఇదొక సరికొత్త అధ్యాయం అవుతుంది. మరి ఈ 7.5 గంటల సినిమా ప్రయోగం ఫలిస్తుందో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వరకు వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+