పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - అనిల్ రావిపూడి కాంబోలో మూవీ..?
టాలీవుడ్ లోని సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో ఒకరిగా పేరొందారు అనిల్ రావిపూడి. పటాస్ సినిమాతో అనిల్ రావిపూడి దర్శకుడిగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి.. ఇప్పటివరకు వరుసగా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాలు సాధించారు. గత ఏడాది వెంకటేష్ హీరోగా 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో భారీ హిట్ అందుకున్నారు. ఆ జోష్ లోనే ఈ ఏడాది కూడా మెగాస్టార్ చిరంజీవితో "మన శంకర వరప్రసాద్ గారు" చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అటు మాస్, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటూ.. చిరు కెరీర్‌లోనే తొలిసారి రూ.300 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందించగా.. భీమ్స్ సిసిరీలియో సంగీతం సమకూర్చారు. నయనతార హీరోయిన్ గా నటించగా విక్టరీ వెంకటేష్ గెస్ట్ అప్పియరెన్స్ తో అదరగొట్టారు. ఈ క్రమంలోనే మీడియాతో ముచ్చటించిన అనిల్.. పవన్ కళ్యాణ్ తో సినిమా గురించి ఓపెన్ అయ్యారు. దీంతో ఈ విషయం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

పవన్ తో సినిమా చేయడంపై మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఆయనను కలవలేదని చెపుకొచ్చారు. డిప్యూటీ సీఎంగా పవన్ ఎంతో బిజీగా ఉన్నారని.. ఎన్నో పనులు ఉంటాయని అన్నారు. ప్రస్తుతం ఆయన రెగ్యులర్ గా సినిమాలు చేయడం లేదని వ్యాఖ్యానించారు. ఆయనతో సినిమా చేయాలనే ఉత్సాహం తనకు ఉందని తెలిపారు. ఒకవేళ తమ కాంబినేషన్ కుదిరితే సంతోషమేనని.. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దామని అన్నారు.
మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... ఒక వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. మరోవైపు తాను కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. ఈ ఏడాది వరుసగా రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్.. "హరిహర వీరమల్లు" చిత్రంతో నిరాశపరిస్తే.. "ఓజీ" మూవీతో భారీ హిట్ ఖాతాలో వేసుకున్నారు. అలానే హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీలో తన షూటింగ్ ఫినిష్ చేసేశారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications