అతను డ్రెస్ మార్చుకుంటుంటే డోర్ ఓపెన్ చేశాడు ..విజయ్ దేవరకొండ హీరోయిన్ సంచలన కామెంట్స్

ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్‌, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ తన జీవితంలో ఎదురైన ఓ ఘటన గురించి వెల్లడించారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు షాలిని పాండే.

అర్జున్ రెడ్డి సినిమాతో షాలిని పాండే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమా ఓ సంచలనమే అని చెప్పాలి.అప్పటి వరకు మూస ధోరణిలో వెళ్తోన్న తెలుగు ఇండస్ట్రీని అర్జున్ రెడ్డి సినిమా మొత్తం మార్చేసింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్‌నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు. సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాతో టాప్ దర్శకుల లిస్ట్‌లో చేరిపోయాడు. అయితే సినిమాలో హీరోయిన్‌గా నటించిన షాలిని పాండే మాత్రం పెద్దగా క్లిక్ కాలేకపోయింది.

director came in when I changed my dress - Shalini Pandey

అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు దక్కలేదు. ఆ తర్వాత ఇద్దరి లోకం ఒకటే, మహానటి, నిశ్శబ్దం, 118 వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ తర్వాత తెలుగులో అరకొర సినిమాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించినప్పటికి అవి కూడా ఆమె కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు. షాలిని పాండే చేతిలో ప్రస్తుతం పెద్దగా సినిమా లేవని తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే షాలిని పాండే.. తన వ్యక్తిగత విషయాలతో పాటు, సినిమా విశేషాలను అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా ఈ భామ తన కెరీర్‌‌లో ఎదురైన చేదు ఘటన గురించి వెల్లడించింది. దీనిపై షాలిని మాట్లాడుతూ..ఓ సినిమా చేస్తున్నప్పుడు ఓ దర్శకుడు ప్రవర్తనతో చాలా ఇబ్బంది పడ్డాను. కారవాన్‌లో నేను డ్రెస్ మార్చుకుంటున్న సమయంలో నా పర్మిషన్‌ లేకుండానే అతడు డోర్‌ తీశాడు. నాకు కోపం వచ్చి వెంటనే ఆయనపై అరిచేశాను. దాంతో అక్కడ నుంచి అతను సైలెంట్‌గా వెళ్లిపోయాడు. అయితే ఆ దర్శకుడు ఎవరనేది మాత్రం ఆమె బయటపెట్టలేదు. ప్రస్తుతం షాలిని పాండే చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+