పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే?

తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా టాప్ హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు పెళ్లిలు చేసుకుంటున్నారు. గ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ కూడా త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాడనే వార్త వైరల్ గా మారింది. పూరీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రామ్ తో డబుల్ ఇస్మార్ట్ చిత్రం చేస్తున్నారు. దీని తర్వాత బాలకృష్ణతో సినిమా చేయాలనే యోచనలో ఉన్నడు పూరీ. ఆయన అవకాశం ఇస్తారా? లేదా? అనేది తర్వాత విషయం.

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రవితేజలను స్టార్ హీరోలు చేసింది ఎవరయ్యా.. అంటే పూరీ అనే పేరు చెబుతారు. ఆయన డైరెక్షన్లో వచ్చిన సినిమాలవల్లే ఇప్పుడు వీళ్ళందరూ సినీ పరిశ్రమను ఏలేస్తున్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ పరిస్థితి బాగోలేదు. చాలా దారుణంగా ఉంది. లైగర్ డిజాస్టర్ కావడం, జనగణమణ పక్కన పడటంతోపాటు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. రామ్ తో తీస్తున్న ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ హిట్టయితే ఒడ్డున పడే అవకాశం ఉంది.

director puri jagannath son akash maraaige details

పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ తన క్లాస్ మేట్ అయిన అమ్మాయిని ప్రేమించాడనే వార్త వైరలవుతోంది. వీళ్ళ ప్రేమ హద్దులు మీరిపోయిందంటున్నారు. త్వరలోనే ఇద్దరూ ఎంగేజ్ మెంట్ చేసుకోబోతున్నారంట. పెళ్లికి ఇరువైపులా కుటుంబ సభ్యులు ఒప్పుకున్న తర్వాతే సోషల్ మీడియాలో అధికారికంగా లీకైందంటున్నారు. అంతేకాదు.. ఆ అమ్మాయి ఓ బడా రాజకీయ నాయకుడి మనవరాలని తెలుస్తోంది. కోట్లరూపాయల ఆస్తికి వారసురాలని సమాచారం. ఏదో ఒకరకంగా ఆకాష్ మాత్రం మంచి జాక్ పాట్ కొట్టాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+