Rapthadu Attack Case : రాప్తాడు దాడి నిందితుడు హేమంత్ పై పోలీసుల కాల్పులు
ఏపీలోని అనంతపురం జిల్లా రాప్తాడు దాడి నిందితుడు హేమంత్ పై పోలీసుల కాల్పులు జరిపారు. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో ఘటన జరిగింది. తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా కాల్పులు జరిపామని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. కాల్పుల్లో నిందితుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడ్ని అనంతపురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శనివారం రాప్తాడు పాఠశాలలో బాలికపై రంపంతో హేమంత్ దాడి చేసిన సంగతి తెలిసిందే.
రాప్తాడులోని పాఠశాలలో తరగతి గదిలోకి చొరబడిన హేమంత్.. పదోతరగతి చదువుతున్న బాలిక గోపికపై ఎలక్ట్రిక్ రంపంతో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న గోపిక.. గాయపడిన లక్ష్మిని స్థానికులు అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతోంది.

ఇక బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స అందించిన డాక్టర్.. ఆయుధం తీవ్రత కారణంగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయని స్పష్టం చేశారు. ముఖంపై ఓ వైపు చర్మం పూర్తిగా ఊడిపోయిందని తెలిపారు. అలాగే మెడ, వీపు భాగంలోని కండరాలు (పారాస్పైనల్ కండరాలు) తెగిపోయినట్లు వెల్లడించారు. ఈ మేరకు తీవ్ర రక్తస్రావంతో అత్యంత విషమ పరిస్థితిలో బాలిక ఆసుపత్రికి తీసుకురాబడిందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
