బెంగళూరు ఆసుపత్రిలో రాప్తాడు బాలిక ఆరోగ్య పరిస్థితిపై నారా లోకేష్ ఆరా: తల్లిదండ్రుల పరామర్శ

అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన రంపం దాడి ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రస్తుతం బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న ఆ విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ నేరుగా సమీక్ష నిర్వహించారు. ఈ సాయంత్రం ఆయన బెంగళూరు మణిపాల్ ఆసుపత్రికి చేరుకున్నారు. బాధిత బాలిక తల్లిదండ్రులను పరామర్శించారు.

ఆసుపత్రి డాక్టర్ల బృందంతో మాట్లాడారు. బాధిత బాలికకు అందుతున్న వైద్య సేవలు, శస్త్రచికిత్స వివరాలు, ప్రస్తుత ఆరోగ్య స్థితిని క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో ఆయన వెంట మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి, ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ, విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా ఉన్నారు. ఆసుపత్రి డాక్టర్ల టీమ్ తో వారంతా సమావేశం అయ్యారు. చికిత్స గురించి ఆరా తీశారు.

Minister Nara Lokesh visits Bengaluru Manipal Hospital to review health condition of Rapthadu student

అనంతరం ఆసుపత్రి ఆవరణలో నారా లోకేష్ మీడియాతో వెల్లడించారు. ఉదయం సుమారు 10 గంటల ప్రాంతంలో ఓ యువకుడు చైన్ సాతో పాఠశాల ప్రాంగణంలోకి అకస్మాత్తుగా ప్రవేశించి విద్యార్థినిపై దాడికి పాల్పడ్డాడని వివరించారు. సమాచారం అందుకున్న వెంటనే తక్షణమే స్పందించి, అనంతపురం జిల్లా పోలీసు యంత్రాంగం, స్థానిక ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేశానని చెప్పారు. విద్యార్థిని ప్రాణాలను కాపాడటమే ప్రాథమిక లక్ష్యంగా అత్యవసర వైద్య సహాయం అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు.

ఏపీ మీదుగా పట్టాలెక్కిన బెంగళూరు వందే భారత్ స్లీపర్: 8 హాల్ట్ స్టేషన్లు
ఏపీ మీదుగా పట్టాలెక్కిన బెంగళూరు వందే భారత్ స్లీపర్: 8 హాల్ట్ స్టేషన్లు

తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించామని, అక్కడి డాక్టర్లు శ్రమించి, రక్తస్రావాన్ని అరికట్టారని, దీంతో బాలిక పరిస్థితి నిలకడగా మారేలా సహాయపడ్డారని నారా లోకేష్ అన్నారు. ఆ వెంటనే మరింత మెరుగైన సూపర్ స్పెషాలిటీ చికిత్స కోసం బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రికి తరలించామని, దీనికి అవసరమైన వాహన, వైద్య ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేశామని చెప్పారు.

పులివెందులలో ఓటు వేయడానికి నిరాకరించిన జగన్: అలా చేస్తే.. !!
పులివెందులలో ఓటు వేయడానికి నిరాకరించిన జగన్: అలా చేస్తే.. !!

మణిపాల్ ఆసుపత్రి డాక్టర్లు సుమారు 12 గంటల పాటు శ్రమించి, శస్త్రచికిత్సను పూర్తి చేశారని నారా లోకేష్ అన్నారు. శస్త్రచికిత్స అనంతరం బాలికను ఐసీయూలో ఉంచారని, ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని డాక్టర్లు తనకు వివరించినట్లు మంత్రి లోకేష్‌ పేర్కొన్నారు. బాధిత విద్యార్థినికి అత్యుత్తమ వైద్యం అందించే పూర్తి బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.

న్యూజిలాండ్ బ్యాటర్ల తుఫాన్ ఇన్నింగ్- టీమిండియాపై భారీ గెలుపు
న్యూజిలాండ్ బ్యాటర్ల తుఫాన్ ఇన్నింగ్- టీమిండియాపై భారీ గెలుపు

బాలిక సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకునేంత వరకు కావలసిన అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వ పరంగా పూర్తిస్థాయిలో అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకునేలా పోలీసు అధికారులను ఆదేశించామని నారా లోకేష్ వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+