Cyclone Murasu: దూసుకొస్తున్న మురసు తుఫాన్-ఈసారి ఏపీలో ఈ జిల్లాలకు ముప్పు..!

ఏపీపై ప్రకృతి పగబట్టినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే అర్నబ్ తుపాన్ ముప్పు ఎదుర్కొని కకావికలం అయిన ఆంధ్రప్రదేశ్ పై మరో తుఫాన్ పడగ విప్పుతోంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయి ఉన్న మురసు తుఫాన్ (cyclone murasu) క్రమంగా ఆంధ్రప్రదేశ్ వైపుకు కదులుతోంది. గత ఆరు గంటలుగా గంటకు 27 కి.మీ వేగంతో ఈ తుఫాన్ కదులుతున్నట్లు వాతావరణ విభాగం ప్రకటించింది. ఇది రేపటి కల్లా తీవ్ర తుఫాన్ గా మారబోతోంది. దీంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు తప్పవని ఐఎండీ హెచ్చరించింది.

పోలింగ్ రోజు పులివెందులలో జగన్ హంగామా..! ఆంక్షలున్నా రోడ్ షో, ధర్నాలు..!
పోలింగ్ రోజు పులివెందులలో జగన్ హంగామా..! ఆంక్షలున్నా రోడ్ షో, ధర్నాలు..!

బంగాళాఖాతంలో బలపడిన మురసు తపాను ప్రస్తుతం చెన్నైకి 480 కిమీ, నెల్లూరుకు 550 కిమీ, మచిలీపట్నానికి 560 కిమీ దూరంలో కేంద్రీకృతం అయినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఇది ఒంగోలుకు 600 కిమీ, విశాఖపట్నానికి 610 కిమీ దూరంలో కేంద్రీకృతం అయినట్లు వెల్లడించింది. రేపు ఉదయానికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఇది తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. రేపు అర్ధరాత్రి -ఎల్లుండి తెల్లవారుజాము సమయంలో నెల్లూరు -నరసాపురం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తోంది. కాబట్టి రేపటి నుంచి మత్స్యకారులు సముద్రంలో వేటకి వెళ్ళరాదని హెచ్చరికలు చేసింది.

Cyclone Murasu Intensifies Over Bay of Bengal IMD Warns of Heavy Rain in AP
పులివెందులోనే ఎందుకిలా ? మీ ఏకగ్రీవాల సంగతేంటి? జగన్ కు లోకేష్ కౌంటర్..!
పులివెందులోనే ఎందుకిలా ? మీ ఏకగ్రీవాల సంగతేంటి? జగన్ కు లోకేష్ కౌంటర్..!

మురసు తుఫాన్ ప్రభావంతో రానున్న మూడురోజులు దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రేపు కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. ఇందులో ఒకటి,రెండుచోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా ఉంటాయని చెబుతోంది.
ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు ఉంటాయని అధికారులు తెలిపారు. అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
ఉందన్నారు. అలాగే నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తుఫాన్ సహాయక చర్యలు కోసం ముందస్తుగా 6 NDRF, 7 SDRF బృందాలు సిద్ధం చేశారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+