భారత్ లెక్కల్ని మార్చబోతున్న అమెరికా ఎన్నికలు..! హెచ్ 1బీల నుంచి మెగా డీల్ వరకూ..!

అమెరికాలో ఎల్లుండి మధ్యంతర ఎన్నికలు (US Midterms) జరగబోతున్నాయి. వీటిలో కాంగ్రెస్ పై పట్టు కోసం డొనాల్డ్ ట్రంప్ పార్టీ రిపబ్లికన్లతో పాటు విపక్ష డెమోక్రాట్లు కూడా తీవ్రంగా పోటీ పడుతున్నారు. అయితే ట్రంప్ వరుస తప్పిదాల నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ పై డెమోక్రాట్లు పట్టు సాధించే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లు ట్రంప్ ను కాదని డెమోక్రాట్లకు అవకాశం ఇస్తే భారత్ పై పడే ప్రభావం ఏంటనే దానిపై ఇరుదేశాల్లోనూ విస్తృతంగా చర్చ జరుగుతోంది.

అమెరికా-చైనా స్పేస్ వార్ లో బిగ్ టర్న్-పెంటగాన్ కంటపడిన డ్రాగన్ సీక్రెట్ ప్లేన్..!
అమెరికా-చైనా స్పేస్ వార్ లో బిగ్ టర్న్-పెంటగాన్ కంటపడిన డ్రాగన్ సీక్రెట్ ప్లేన్..!

ఈ మధ్యంతర ఎన్నికలలో, రెండు ప్రత్యేక ఎన్నికలతో సహా మొత్తం 435 ప్రతినిధుల సభ సీట్లు, 35 సెనేట్ సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం రిపబ్లికన్లు ప్రతినిధుల సభలో 218-214 ఆధిక్యంలో ఉన్నారు, అయితే ఖాళీల కారణంగా డెమొక్రాట్లు గెలుచుకోవాల్సిన సీట్ల కచ్చితమైన సంఖ్యపై ప్రభావం పడనుంది. బ్యాలట్‌పీడియా లెక్కల ప్రకారం డెమొక్రాట్లు నియంత్రణ సాధించడానికి ప్రతినిధుల సభలో నికరంగా మూడు సీట్లు గెలుచుకోవాలి. రాయిటర్స్ మాత్రం నాలుగు సీట్లు అవసరమని చెబుతోంది. దీని ప్రకారం డెమొక్రాట్లు ప్రతినిధుల సభను గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉండగా, సెనేట్ ఫలితం మాత్రం అనిశ్చితంగా కనిపిస్తోంది.

US Midterms What a Democratic Takeover of Congress Could Mean for India H-1B Visas and Trade

కాంగ్రెస్ ను డెమోక్రాట్లు గెల్చుకుంటే ముందుగా ప్రభావం పడేది భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం పైనే. అదే జరిగితే భారతీయ వస్తువులకు ప్రధాన గమ్యస్థానంగా ఉన్న అమెరికా సుంకాల విధానంలో మార్పులు ఎగుమతిదారులను నేరుగా ప్రభావితం చేస్తాయి.
ఫిబ్రవరిలో ఇరుదేశాలూ మధ్యంతర వాణిజ్య ఒప్పందం చట్రాన్ని ప్రకటించాయి. దీని ప్రకారం భారతీయ వస్తువులపై 18 శాతం పరస్పర సుంకాన్ని విధిస్తామని అమెరికా చెప్పింది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలను కొనసాగించడానికి కూడా ఇరుపక్షాలు కట్టుబడి ఉన్నాయి. దీని అమలు స్థితి నిర్ధారణ అయ్యే వరకు, దాన్ని పూర్తిగా ముగిసిన వాణిజ్య ఒప్పందంగా భావించకూడదు.
కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా వాణిజ్య భాగస్వాములపై సుంకాలు విధించే ట్రంప్ అత్యవసర అధికారాలను ఉపయోగించడాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో సుంకాలు 10 శాతం ప్రాథమిక స్థాయికి పడిపోయాయి. కానీ ఇరుదేశాల మధ్య ఒప్పందం మాత్రం కుదిరే అవకాశాలు కనిపించడం లేదు.

US Midterms What a Democratic Takeover of Congress Could Mean for India H-1B Visas and Trade
ట్రంప్ కు అమెరికా కోర్టులో ఎప్ స్టీన్ షాక్..! వాల్ స్ట్రీట్ వివాదంలో..!
ట్రంప్ కు అమెరికా కోర్టులో ఎప్ స్టీన్ షాక్..! వాల్ స్ట్రీట్ వివాదంలో..!

అలాగే అమెరికాలో పనిచేస్తున్న భారతీయ నిపుణులకు, ముఖ్యంగా హెచ్-1బి వీసాదారులకు ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన లక్ష డాలర్ల ఫీజుకు చట్టపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. ఫెడరల్ ఏజెన్సీలు అవసరమైన నియమ నిబంధనల ప్రక్రియను పాటించలేదని నిర్ధారించి, ఇద్దరు ఫెడరల్ న్యాయమూర్తులు వేర్వేరు కేసులలో దీని అమలును నిలిపివేశారని రాయిటర్స్ తెలిపింది. ఈ తీర్పులు విధానంపై చట్టపరమైన పరిమితులు మాత్రమే, అంతేగానీ వ్యాజ్యానికి తుది పరిష్కారం కాకపోవచ్చు. కాంగ్రెస్ నియంత్రణలో మార్పు భవిష్యత్ వలస చట్టాలు, పర్యవేక్షణపై ప్రభావం చూపవచ్చు. కానీ అది వీసా నిబంధనలలో తక్షణ మార్పులకు దారితీయకపోవచ్చని అంచనా. ఒకవేళ డెమొక్రాట్లు కాంగ్రెస్, సెనేట్‌లో మెజారిటీ సాధిస్తే, వారికి మరింత బలం చేకూరుతుందియ అయినా విదేశాంగ విధానంతో పాటు అన్ని విధానాలూ ఉమ్మడి రాజకీయ బాధ్యత వంటి వాటి వల్ల పరిమితమయ్యే అవకాశం ఉంది. ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు మెజారిటీ సాధించినప్పటికీ, ట్రంప్ అజెండాను అడ్డుకోవడానికి వారు చేయగలిగేది చాలా తక్కువగా ఉంటుందని యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ గత వారం తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+