చీకటి రోజు..: ఎస్ఈసీ కార్యాలయం వద్ద వైసీపీ బైఠాయింపు

విజయవాడ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు. మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్ జరిగిన నవంబర్ 1వ తేదీని ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతుందని అభివర్ణించారు. కూటమి నేతలు పోలింగ్‌ కేంద్రాలను ఆక్రమించడం, ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపించడం, అభ్యర్థులు, కార్యకర్తలపై దాడులు, అక్రమ అరెస్టులకు పాల్పడటం వంటి ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఎన్నికల నిర్వహణలో తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాల్సిన కమిషనర్‌ నిస్సహాయత వ్యక్తం చేయడం.. రాజ్యాంగబద్ధ సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీస్తోందని పేర్కొన్నారు. అక్రమాలు జరిగిన ప్రాంతాల్లో పోలింగ్‌ రద్దు చేసి, రీపోలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

YSRCP staged a protest at State Election Commission office declaring Nov 1 Black day for democracy

వైసీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, కల్పలతారెడ్డి, రుహుల్లా, పార్టీ సీనియర్ నేతలు ఇందులో పాల్గొన్నారు. ఇంతటి అరాచకాలు, అక్రమాలు గతంలో ఎప్పుడూ చూడలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులను అడ్డు పెట్టుకుని వైసీపీ అభ్యర్థులపై దాడులు చేస్తూ ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేశారని ధ్వజమెత్తారు. ప్రజలపై నమ్మకం ఉంటే బ్యాలెట్‌ ద్వారా వారి అభిప్రాయాన్ని తెలుసుకోవాలే గానీ బుల్లెట్‌తో కాదని అన్నారు.

పులివెందులలో ఓటు వేయడానికి నిరాకరించిన జగన్: అలా చేస్తే.. !!
పులివెందులలో ఓటు వేయడానికి నిరాకరించిన జగన్: అలా చేస్తే.. !!

రాష్ట్రవ్యాప్తంగా 12,724 పోలింగ్‌ కేంద్రాలు ఉంటే 6,000 నుంచి 7,000 వేల బూత్ లల్లో మాత్రమే సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌ ఉన్నట్లు ఎస్ఈసీ చెబుతోందని, మిగిలిన చోట్ల ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొందని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేయాలని హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశించినా అమలు చేయట్లేదని గుర్తు చేశారు.

ఏపీ మీదుగా పట్టాలెక్కిన బెంగళూరు వందే భారత్ స్లీపర్: 8 హాల్ట్ స్టేషన్లు
ఏపీ మీదుగా పట్టాలెక్కిన బెంగళూరు వందే భారత్ స్లీపర్: 8 హాల్ట్ స్టేషన్లు

పులివెందుల, కడప, జమ్మలమడుగు, మదనపల్లె, చిత్తూరు, చీమకుర్తి, మాచర్ల, చిలకలూరిపేట, రాయచోటి, రాజంపేట తదితర ప్రాంతాల్లో అనేక అక్రమాలు జరిగాయని, వీటన్నింటిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు అందించామని వైసీపీ ఎమ్మెల్సీలు వివరించారు. అక్రమాలు జరిగిన ప్రాంతాల్లో ఎన్నికలను రద్దు చేసి రీపోలింగ్‌ నిర్వహించాల్సిందేనని తేల్చి చెప్పారు. ఎన్నికల కమిషన్‌ పనితీరుపైనా న్యాయపోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.

పులివెందులలో జగన్ కారును అడ్డుకున్న దస్తగిరి
పులివెందులలో జగన్ కారును అడ్డుకున్న దస్తగిరి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దాడులు, దౌర్జన్యాలు నిత్యకృత్యంగా మారాయని కల్పలతారెడ్డి విమర్శించారు. పులివెందుల మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి ప్రమిళమ్మ జమ్మలమడుగులో హైమావతి, విశాఖలో వరుదు కల్యాణిపై దాడి చేశారని ఆరోపించారు. మహిళలను రక్షించాల్సిన బాధ్యత ఉన్నవారే దాడులకు పాల్పడుతున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+