నువ్వు ఈ లక్షణం మార్చుకో: మహేష్‌బాబుకు రాజమౌళి సీరియస్ వార్నింగ్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 29వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అటవీ నేపథ్యంలో యాక్షన్ అడ్వంచర్ గా రాజమౌళి ఈ సినిమాను దర్శకుడు తీర్చిదిద్దుతున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమాను రూ.1500 కోట్ల భారీ బడ్జెట్ తో దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. హాలీవుడ్ సినిమాలకన్నా ధీటుగా దీన్ని రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తో హాలీవుడ్ లో కూడా పేరు తెచ్చుకున్న రాజమౌళి తీయబోతున్న ఈ సినిమాప ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు, సినీ రంగాలకు చెందినవారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కృష్ణ గట్టిగా చెప్పినా వినలేదు
ఎటువంటి ప్రచారం నిర్వహించకుండా, మీడియాకు సమాచారం ఇవ్వకుండా సైలెంట్ గా షూటింగ్ ను ప్రారంభించేశారు. మహేష్ బాబుతో సినిమా చేయాలని ప్రతి దర్శకుడు భావిస్తారు. ఎందుకంటే ఆయన దర్శకులకు అనుకూలంగా ఉండే నటుడు కాబట్టి. ప్రతి సన్నివేశాన్ని ముందుగానే దర్శకులందరికీ చేసి చూపిస్తారు. అంతేకాదు.. యాక్షన్ సన్నివేశాలు, అత్యంత ప్రమాదకరమైన సన్నివేశాల్లో కూడా డూప్ లేకుండా తానే నటిస్తుంటారు. దీనిపై మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ చాలాసార్లు హెచ్చరించారు. అయినా తన అలవాటును మానుకోలేదు. అటువంటి సన్నివేశాల్లో నటించేటప్పుడు జరగరానిది ఏదైనా జరిగితే అభిమానుల నుంచి, ఇతరుల నుంచి హెచ్చరికలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. దీనివల్ల షూటింగ్ కు అంతరాయం కలుగుతుంది. హీరోకు దెబ్బ తగిలి షూటింగ్ ఆగిపోతే ఇతర నటుల కాల్షీట్లన్నీ వృథా అవడంతోపాటు మరోసారి వారి కాల్షీట్ల కోసం, ఇతర ఖర్చుల కోసం సినిమా బడ్జెట్ అనుకున్నదానికన్నా ఎక్కువవుతుంది.

director Rajamouli serious warning to hero Mahesh babu

భవనం మీద నుంచి తానే దూకేశాడు
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నేనొక్కడినే సినిమాలో ఒక భవనం మీద నుంచి మరో భవనం మీదకు డూప్ లేకుండా మహేష్ దూకేశాడు. ఇటువంటి రాజమౌళి దృష్టిలో ఉంచుకొని ప్రిన్స్ కు గట్టిగా హెచ్చరిక జారీచేశాడు. ఇటువంటివన్నీ మానుకోవాలని, కొన్ని సన్నివేశాల్లో డూప్ ను పెట్టక తప్పదని, నేనే నటిస్తానంటూ మొండిపట్టు పట్టొద్దంటూ గట్టిగా చెప్పేశాడు. రాజమౌళి లాంటి దర్శకుడు గట్టిగా చెప్పిన తర్వాత ఎదురు మాట్లాడే హీరో ఉండరుకదా. మహేష్ బాబు కూడా దీనికి ఓకే చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+