కోలీవుడ్ బ్యూటీతో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల డేటింగ్..?
ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఈ డైరెక్టర్.. బ్రహ్మోత్సవం మూవీతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. చివరగా ఆయన తెరకెక్కించిన 'పెదకాపు' సినిమా ప్రేక్షకులను ఆశించిన మేర అలరించలేకపోయింది. ప్రస్తుతం మరో చిత్రం తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.
మరోవైపు వివాదాలకు దూరంగా ఉండే శ్రీకాంత్ అడ్డాల గురించి ఓ వార్త.. సినీవర్గాల్లో చక్కర్లు కొడుతుంది. తన సతీమణితో విబేదాలు రావడంతో ఆయన కోలీవుడ్ హీరోయిన్‌తో కొంత కాలంగా కలిసి జీవిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో ఎవరా హీరోయిన్.. ఆ స్టోరీ ఏంటి అని హాట్ డిస్కషన్ నడుస్తోంది. అయితే ఆమె ఎవరో కాదు ప్రముఖ తమిళ నటి బ్రిగిడా సాగాగా చెబుతున్నారు.

బ్రిగిడా సాగా తెలుగులో నటించినవి తక్కువ సినిమాలే అయిన తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకుంది. సింధూరం, పెదకాపు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ. పెద కాపు చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించగా.. ఈ సమయంలోనే వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని అంటున్నారు. దాంతో అప్పటి నుంచి వారి మధ్య రిలేషన్ నడుస్తోందని.. ఇప్పటికే చెన్నైలో బ్రిగిడా సాగాతో శ్రీకాంత్ కలిసే ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగానే తన భార్యతో శ్రీకాంత్ అడ్డాలకు గొడవలు జరుగుతున్నాయని టాక్ నడుస్తోంది.
అయితే బ్రిగిడా సాగాను తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన వ్యక్తి.. నటుడు, దర్శకుడు పార్ధిబన్. కేవలం నటుడు గానే కాకుండా దాదాపు 16 సినిమాలకు దర్శకుడిగా.. 14 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. వందకు పైగా సినిమాల్లో యాక్టర్‌గా మెప్పించాడు. యుగానికి ఒక్కడు సినిమాలో రాజుగా ఆయన నటనను ఎవరూ మర్చిపోలేరు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనను బ్రిగిడా - శ్రీకాంత్ అడ్డాల రిలేషన్ గురించి ప్రశ్నించగా ఓపెన్ అయ్యారు.
బ్రిగిడాను చిత్రపరిశ్రమకు తానే పరిచయం చేశానని.. అందుకే ఈ ప్రశ్నను చాలామంది తనను అడిగారని చెప్పుకొచ్చారు. కానీ వారిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో తనకు తెలియదని.. బ్రిగిడా మాత్రం మంచి నటి అని చెప్పారు. ఇలాంటి గాసిప్స్ లను ఆమె పెద్దగా పట్టించుకోదని.. రిలేషన్స్ పెట్టుకుని తన కెరీర్‌ను నాశనం చేసుకోదని స్పష్టం చేశారు. వారిద్దరి మధ్య రిలేషన్ కేవలం రూమర్ మాత్రమేనని తాను అనుకుంటున్నానని క్లారిటీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications