ఇంతమంది విడాకులు తీసుకున్నారా..?
2024వ సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. ఇంకా కొన్ని రోజుల్లో 2025 మొదలుకాబోతుంది. ఈ సమయంలో 2024లో చాలానే మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. అనేక రకాల సంఘటనలు ఈ 2024లో చోటు చేసుకున్నాయి. అలాగే ఎంతో మంది ఈ సంవత్సరం సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. 2024లో కొందరు సెలబ్రిటీలు తమ సినిమాలతో వార్తల్లో నిలిచారు.
అలాగే కొందరు తమ జీవిత భాగస్వామికి విడాకులు ఇచ్చి సంచలనం సృష్టించారు. ఇలా 2024లో విడాకులు తీసుకున్న సెలబ్రిటీల లిస్ట్‌ను ఓసారి పరిశీలిస్తే.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మరియు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ 2024లో విడాకులు తీసుకున్నారు. ఇది తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో సంచలనం సృష్టించింది.ప్రపంచ ప్రసిద్ధ సంగీత దర్శకుడు ఆర్. రెహ్మాన్ కూడా విడాకులు తీసుకున్నారు. తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు మరియు నటుడు జి.వి. ప్రకాష్ కూడా విడాకులు తీసుకున్నారు.

బాలీవుడ్ నటి ఇషా దేయోల్ తన భర్త భరత్ తక్తాని నుండి విడాకులు తీసుకుంది. భారతీయ క్రికెటర్ హార్దిక్ పాండ్య కూడా విడాకులు తీసుకున్నారు. కోలీవుడ్ హీరో జయం రవి తన భార్య ఆర్తి నుంచి విడాకులు ప్రకటించడం అందర్నీ షాక్‌కి గురి చేసింది. 15 ఏళ్లపాటు వైవాహిక బంధంలో కలిసున్న తర్వాత వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సైతం తన వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పేసింది.












Click it and Unblock the Notifications