టాలీవుడ్ బిగ్ స్టార్స్ కు ఝలక్ ఇచ్చిన చిన్న హీరో.. మతిపోగొట్టే కలెక్షన్స్..
ఇటీవలి కాలంలో చిన్న సినిమాల హవా కొనసాగుతోంది. కంటెంట్ తో వచ్చిన చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతున్నాయి. పెద్ద హీరోలు.. వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉండటంతో బాక్సాఫీస్ ముందు ఆ సినిమాలు చతికిలపడుతున్నాయి. ఇక 90 ఏ మిడిల్ క్లాస్ బయోపిక్, లిటిల్ హార్ట్స్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు మౌళి తనుజ్. అయితే ఆయన నటించిన తాజా చిత్రం డీఎన్ కే.. నవంబర్ 13 న గ్రాండ్ గా విడుదలైంది.
ఈ చిత్రానికి శ్రీను కంబాల దర్శకత్వం వహించారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలో సుష్మిత శెట్టి హీరోయిన్ గా నటించింది. అలాగే అలీ, రజిత, రఘుబాబు, భద్రం, గుండు సుదర్శన్, ప్రియా కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ మిక్స్ డ్ టాక్ తోనే భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ మూవీ రిలీజ్ అయిన ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయినట్లు సమాచారం అందుతోంది.
నవంబర్ 13 న విడుదలైన ఈ మూవీ ఆరో రోజు రూ. 76లక్షల గ్రాస్ ను వసూలు చేసింది. ఓవరాల్ గా ఈ చిత్రం ఆరు రోజుల్లో రూ. 9.26 కోట్ల గ్రాస్ అలాగే రూ. 8.04 కోట్ల నెట్ వసూళ్లను సాధించిందని సాక్ నిల్క్ సైట్ వెల్లడించింది. ఈ మూవీని రూ. 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ప్రొమోషన్స్ కూడా కలుపుకుని మొత్తం ఈ మూవీకి ఆరున్నర కోట్ల వరకు బడ్జెట్ అయినట్లు సమాచారం. ఇక డీఎన్ కే మూవీకి రూ. 8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన సినిమా హిట్ కావాలంటే రూ. 16 కోట్ల గ్రాస్ రావాల్సి ఉంటుందని సమాచారం. అయితే ఈ మూవీ మూడు రోజుల్లోనే దాదాపు రూ. 10 కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. వీటికి ఓవర్సీస్ వసూల్లు కూడా యాడ్ కావాల్సి ఉంది. ఈ లెక్కన చూస్తే డీఎన్ కే మూవీ లాభాలతోనే బయటపడనున్నట్లు కనిపిస్తుంది.

మరోవైపు ఈ మూవీ రిలీజ్ అయిన రోజే టాలీవుడ్ లో 'ఇట్లు అర్జున' అనే మూవీ కూడా రిలీజ్ అయింది. ఈ చిత్రంతో టాలీవుడు నిర్మాత మహేష్ రెడ్డి కుమారుడు అనీష్ రెడ్డి హీరోగా పరిచయం అయ్యారు. ఈ మూవీకి టాలీవుడ్ బిగ్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్, నాగార్జున తదితరులు ప్రొమోషన్స్ చేశారు. కానీ ఇట్లు అర్జున మూవీకి కలెక్షన్స్ రాకపోవడం గమనార్హం. ఈ మేరకు చిన్న హీరో మౌళి.. టాలీవుడ్ స్టార్స్ కూ షాక్ ఇచ్చినట్లుగానే చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications
