2024లో ఏ హీరోయిన్ కోసం ఎక్కువగా సెర్చ్ చేశారో తెలుసా..?
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాను ఓ సాధనంగా వాడుతున్నారనే విషయం అందరికి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఈజీగా రీచ్ కావొచ్చనే అభిప్రాయం చాలామంది సెలబ్రిటీల్లో నెలకొంది. అయితే కొంతమంది సెలబ్రిటీలు ఈ సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్‌ను బయటపెడుతున్నారు. ఇక హీరోయిన్లు అయితే ఈ లిస్ట్‌లో ముందు వరుసలో ఉంటారు. హీరోయిన్లు తమ సినిమాలతో పాటు, సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండేందుకు ప్రాధాన్యతను ఇస్తుంటారు. అయితే 2024 సంవత్సరంలో నెటిజన్లు ఎక్కువగా ఓ హీరోయిన్ కోసం నెట్‌లో తెగ సెర్చ్ చేశారు.
ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. బాలీవుడ్‌లో ఇప్పటికిప్పుడు స్టార్ హీరోయిన్ ఎవరంటే అందరు ఠక్కన చెప్పే పేరు కియారా అద్వానీ. వరుస సినిమాల్లో నటిస్తూ అక్కడ స్టార్ హీరోయిన్‌గా కియారా అద్వానీ మారిపోయింది. ఇదే సమయంలో తెలుగులో కూడా మహేష్ బాబు, రామ్ చరణ్ హీరోల వంటి సినిమాల్లో నటించి సౌత్‌లో కూడా మంచి గుర్తింపు దక్కించుకుంది. మహేష్ బాబుతో భరత్ అనే నేను, రామ్ చరణ్‌తోవినయ విధేయ రామ సినిమాల్లో నటించింది.

ప్రస్తుతం రామ్ చరణ్ సరసన 'గేమ్ ఛేంజర్' సినిమాలో నటిస్తోంది. బాలీవుడ్ హీరో సిద్దార్ధ్ మల్హోత్రాను కియారా గతేడాది ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. మరో మూడు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. తాజాగా కియారా అద్వానీ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 2024లో నెటిజన్లు ఎక్కువగా వెతికిన హీరోయిన్‌గా కియారా అద్వానీ రికార్డు సొంతం చేసుకుంది. కియారా అద్వానీ నటించిన సినిమాలతో పాటు, ఆమె వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువగా సెర్చ్ చేశారు. ఇక ఇదే సమయంలో కియారా అద్వానీ ప్రెగ్నెంట్ అయిందంటూ వచ్చిన రూమర్స్ కూడా ఆమెను వార్తల్లో నిలిచేలా చేసింది. ఇక ఇటీవల 'గేమ్ ఛేంజర్' టీజర్ విడుదల సమయంలో కూడా కియారా అద్వానీనే హైలెట్‌గా నిలిచింది. ఇలా మొత్తానికి కియారా అద్వానీ గురించి నెటిజన్లు అధికంగా వెతికారు.












Click it and Unblock the Notifications