మన దేశంలో ఉన్న ఒకే ఒక 'ఇరాన్' హీరోయిన్ ఎవరో తెలుసా..?
సినిమా అంటేనే హద్దులు లేని ప్రపంచం అని అంటుంటారు. ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి సినిమాలో పాత్రల కోసం చాలా మంది ప్రయాణిస్తుంటారు. తమ వైవిధ్యమైన నటనతో అక్కడివారిని విశేషంగా ఆకట్టుకుని ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటారు. ఇక ఇటీవలి కాలంలో ఓటీటీల పుణ్యమా అని మనవాళ్లు తెలుగు కంటే కొరియన్, మలయాళం లాంటి వెబ్ సిరీస్ లే ఎక్కువగా చూస్తున్నారు. ఇప్పుడు భారత్ లో కూడా ఏ పెద్ద మూవీ అయినా పాన్ ఇండియా రేంజ్ లోనే విడుదల అవుతుంది.
అయితే ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్త వాతావరణం ఉన్న విషయం తెలిసిందే. ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా దాడులు చేస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని హతమార్చాయి. ఆయనతో పాటు ఆయన కుటుంబం, అలాగే దాదాపు 30 మందికి పైగా అధికారులు హతం అయ్యారు. మరోవైపు ఇరాన్ పై యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. ఇదే విషయంపై ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ పై దాదాపు 4- 5 వారాల పాటు యుద్ధం కొనసాగుతుందని తెలిపారు.
ఈ క్రమంలో మనదేశంలో ఇరాన్ కు చెందిన హీరోయిన్ ఉందని మీకు తెలుసా..? ఆమె ఎవరో కాదు ఎల్నాజ్ నొరౌజీ.. ఖమేనీ మృతి చెందిన తర్వాత ఈమె సంబరాలు చేసుకుంటూ సోషల్ మీడియా లో అప్లోడ్ చేసిన వీడియో బాగా వైరల్ అయింది. అంతేకాక ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు నేను ఇరాన్ కు వెళ్తే.. నన్ను కచ్చితంగా చంపేస్తారు అంటూ చెప్పుకొచ్చింది. ఎల్నాజ్ చిన్నప్పుడే ఇరాన్ ను వీడింది.

ఆ తర్వాత యూరోప్ లో మోడలింగ్ నేర్చుకుంది. అయితే ఈమె ప్రస్తుతానికి ఇండియాలోనే ఉంటోంది. ఈమె సినీ ప్రస్థానాన్ని ఒకసారి చూస్తే.. 2018 సంవత్సరంలో 'మాన్ జావో నా' అనే ఉర్దూ చిత్రం ద్వారా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'కిది కుంధీ' అనే పంజాబీ చిత్రంలోనూ నటించింది. ఆ తర్వాత ఎల్నాజ్ 'సాక్రేడ్ గేమ్స్' అనే వెబ్ సిరీస్ లోనూ నటించింది. ప్రస్తుతం ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఈమె వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications