నాన్న ముందే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా..నటి షాకింగ్ కామెంట్స్..
సాధారణ అమ్మాయిలే కాదు.. స్టార్ హీరోయిన్లు సైతం లైంగిక వేధింపులకు గురయ్యారు. గురవుతున్నారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వంటివి చాలా సందర్భాల్లో బయటపడ్డాయి. చాలామంది హీరోయిన్లు వారు ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టారు. తాజాగా ఇప్పడు మరో నటి తనపై జరిగిన లైగింక వేధింపుల గురించి తొలిసారిగా అభిమానులతో పంచుకుంది. తనెవరో కాదు నటి ఆండ్రియా. ఆండ్రియా పేరు చెప్పగానే యుగానికొక్కడు సినిమా గుర్తుకొస్తుంది. ఈ సినిమాలో కార్తీ సరసన ఆండ్రియా నటించి మెప్పించింది. ఈ చిత్రంతో ఆండ్రియా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తాజాగా ఈ నటి తాను లైంగిక వేదింపులకు గురైనట్లు తెలిపింది. చిన్నవయసులోనే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా.. అది కూడా మా నాన్న ముందే జరిగింది అని ఈ నటి తెలిపింది.
నటి ఆండ్రియా చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. పదకొండేళ్ల వయసులోనే తను లైంగిక వేధింపులకు గురయానని నటి తెలిపింది. పసిపాయ్రంలోనే ఈ నటి ఓ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నట్లు తెలిపారు. చిన్న తనంలో తన తల్లిదండ్రులతో కలిసి బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది అంటూ చెప్పుకొచ్చింది. నేను మా నాన్న సీటుకు కొంచం దూరంలో ఉన్న సీట్ లో కూర్చుని ఉన్నాను. అప్పుడు నేను జీన్స్, టీషర్ట్ వేసుకుని ఉన్నా. ఆ సమయంలో ఎవరో నా టీ షర్ట్ లో చేయిపెట్టారు. దాంతో ఆ సమయంలో నాకు ఏం జరుగుతుందో కూడా అర్ధం కాలేదు. బయపడి వెంటనే ఏడ్చేశా.. వెంటనే అక్కడినుంచి లేచి వెళ్లి మా నాన్న పక్కన కూర్చున్నా అని నటి ఆండ్రియా తెలిపింది. నటి ఆండ్రియా చేసి వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు వైరల్ గా మారాయి.

సింగర్‌గాను గుర్తింపు ఉంది...
ఆండ్రియా జర్మియా 2005లో కందా నాల్ ముదల్ అనే తమిళ సినిమా ద్వారా సినిమాలోకి ఆరంగ్రేటం చేశారు. తమిళంతో పాటు తెలుగు మలయాళంలో కూడా పలు సినిమాలు చేశారు. కళాశాలలో ఉన్నప్పుడే పలు స్టేజ్‌షోలు చేసింది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటూనే సింగర్‌గాను నిరూపించుకుంది. తమిళంతో పాటు తెలుగులోనూ పలు సినిమాల్లో నటించింది.












Click it and Unblock the Notifications