యాంకర్ రష్మీకి ఘోర అవమానం!
యాంకర్ రష్మీ కి అవమానం జరిగింది. ఓ జబర్దస్త్ కమెడియన్ ఆమె పరువు తీశాడు. టిల్లు స్క్వేర్ సినిమా ఎంత ఘనవిజయం సాధించిందో చూవాం. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు రూ.125 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఒకరకంగా సిద్ధు ఈ సినిమాలో వన్ మ్యాన్ షో చేశాడని చెప్పొచ్చు. డైలాగులు, మేనరిజమ్స్ నవ్వులు కురిపించాయి. థియేటర్ కు వెళ్లిన ప్రేక్షకులు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు.
తాజాగా టిల్లు స్క్వేర్ మూవీ స్పూఫ్ జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానుయేల్ చేశాడు. ఇలా చేసే క్రమంలో అతను రష్మీని ఇనసల్ట్ చేశాడు. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలను కలిపి స్కిట్ చేశారు. ఇమ్మానియేల్ తోపాటు మరో కమెడియన్ టిల్లుగా నటించాడు. ఆ కమెడియన్ టిల్లు స్క్వేర్ సినిమాలో హీరో హీరోయిన్ ను ఫ్లర్ట్ చేసినట్లే రష్మీని ఫ్లర్ట్ చేశాడు. ఆమెను ఉద్దేశిస్తూ ఎక్కడో మనసు విరిగిపోయినట్లుంది అంటాడు. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అని అడుగుతాడు.

అందుకు సమాధానమిచ్చిన రష్మీ నీకెందుకు అంటూ మండిపడుతుంది. దీంతో ఆ కమెడియన్ పంచ్ వేస్తాడు. ఏం లేదు.. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటే తన షూ తాను వేసుకొని వెళ్లిపోతానని, లేదంటే ఈ షూను నీపై వేసి పోతానంటాడు. అని షూ విసురుతాడు. రష్మీకి ఏం చేయాలో అర్థం కాక నోరు వెళ్లబెట్టింది. ఆ కమెడియన్ ఇలా చెప్పడం హైలైట్ అయింది. రాధిక పాత్రలో వర్ష కనిపించింది. లిల్లిగా మరోలేడీ కమెడియన్ చేసింది. అయితే ఇదంతా ఫన్ లో భాగంగానే చేశారు.
ఎక్స్ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో నవ్వులు పూయిస్తోంది. ఇమ్మానుయేల్ స్కిట్ హైలైటైంది. ఆటో రాంప్రసాద్ రోహిణీతో కలిసి కామెడీని పండించాడు. రాకింగ్ రాకేష్, బుల్లెట్ భాస్కర్ తమదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నారు. వచ్చే శుక్రవారం ఈ షో ప్రసారం కానుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో వైరలవుతోంది.












Click it and Unblock the Notifications