మీడియా పేరు అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్న ఫేమస్ యాంకర్, ఢమాల్
బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకునే ప్రయత్నం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో తప్పించుకుని తిరుగుతున్న ప్రముఖ యాంకర్ దివ్య వసంత అలియాస్ దివ్య అరెస్ట్ అయ్యారు. బెంగళూరులోని భీమనగర్ పోలీసులు కేరళలో తలదాచుకున్న యాంకర్ దివ్యను అరెస్టు చెయ్యడం కలకలం రేపుతోంది. కర్ణాటకలో యాంకర్ గా దివ్య వసంతకు చాలా పేరు ఉంది. అయితే ఇలాంటి కేసులో యాంకర్ దివ్య అరెస్టు అవుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు.
దివ్య వసంత, ఆమె గ్యాంగ్ కలిసి బెంగళూరులోని ఇందిరానగర్‌లోని స్పా యజమానిని బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి లక్షల్లో డబ్బు వసూలు చేసిన కేసులో ముగ్గురు అరెస్టు అయ్యారు. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే ప్రముఖ న్యూస్ ఛానల్ పేరును అడ్డం పెట్టుకుని యాంకర్ దివ్య ఆమె టీమ్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వెలుగు చూడటంతో మీడియా సైతం షాక్ అయ్యింది. ఈ కేసులో యాంకర్ దివ్య వసంత పరార్ అయ్యింది.

యాంకర్ దివ్య కేరళలో తలదాచుకున్నట్లు పక్కా సమాచారం అందడంతో బెంగళూరు పోలీసులు కేరళ వెళ్లి ఆమెను అరెస్టు చేశారు.వారం రోజులుగా పోలీసులకు చుక్కలు చూపించిన యాంకర్ దివ్య తమిళనాడు మీదుగా కేరళకు పారిపోయి అక్కడే తలదాచుకుంది. కేరళలో యాంకర్ దివ్యను అరెస్ట్ చేసి బెంగళూరు తీసుకొచ్చిన జీవన్ భీమానగర్ పోలీసులు ప్రస్తుతం ఆమెను విచారించి వివరాలు సేకరిస్తున్నారు.
బెంగళూరులోని ఇందిరానగర్ లోని స్పా నిర్వాహకుడిని బెదిరించి, అతన్ని బ్లాక్ మెయిల్ చేసి రూ. 15 లక్షలు లాక్కోవడానికి ప్రయత్నించిన కేసులో రాజ్ న్యూస్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ రాజానుకుంటే వెంకటేష్, యాకంర్ దివ్య వసంత అలియాస్ దివ్య, ఆమె తమ్ముడు సందేశ్‌తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.వెంకటేష్, దివ్యలు దోపిడీ కోసం 'సైస్ రీసెర్చ్ టీమ్' అనే వాట్సాప్ గ్రూప్‌ను సృష్టించారు.
ఈ గ్రూపులో నిందితులు తమ ఎజెండాలపై నిత్యం చర్చించేవారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఈ ఉదంతం బయటకు వచ్చిన వెంటనే మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని ఇందిరా నగర్ 80 ఫీట్ రోడ్ మైకెల్ పాళ్య సమీపంలోని సహారా ఇంటర్నేషనల్ స్పా మేనేజర్ మహేష్ శెట్టిని బెదిరించిన నిందితులు రూ.లక్షలు లాక్కొన్నారు. తరువాత కూడా నిందితులు బ్లాక్ మెయిల్ చెయ్యడంతో బాధితుడు మహేష్ శెట్టి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రాజ్ న్యూస్ సీఈవో వెంకటేష్ తదితరులపై బెంగళూరులోని ఇందిరా నగర్ పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. ఈ రెండు కేసులు ఇందిరాగర్ లో జరిగాయి.ఈ కేసుకు సంబంధించిరాజ్‌న్యూస్ ఎండీ క్లారిటీ ఇచ్చారు. పలుచోట్ల బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిన ఆరోపణలపై అరెస్టు అయిన నిందితులకు రాజ్ న్యూస్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆ ఛానెల్ మేనేజింగ్ డైరెక్టర్ స్పష్టం చేశారు.
మేము రాజ్ న్యూస్‌లో ఏ సీఇవో పోస్ట్‌ను సృష్టించలేదని, రాజనుకుంటే వెంకటేష్ మా సంస్థలో మార్కెటింగ్ విభాగంలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో గత మూడు నెలలుగా పనిచేస్తున్నాడని, మా సంస్థలో అతను సీఇవో ఉద్యోగి కాదని, రాజ్‌న్యూస్ ఎండీ స్పష్టం చేశారు. వెంకటేష్ తాను సీఇవోగా చెప్పుకోవడంపై అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని. ఇతర నిందితులు మా సంస్థ ఉద్యోగులు కాదు అని, రాజ్ న్యూస్ పేరును నిందితులు దుర్వినియోగం చేయడంతో చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని రాజ్ న్యూస్ ఎండీ క్లారిటీ ఇచ్చారు. ఈ కేసులో అరెస్టు అయిన నిందితులతో పాటు రాజ్ న్యూస్ పేరు చేర్చకూడదని ఆ సంస్థ పోలీసులకు మనవి చేసింది.












Click it and Unblock the Notifications