ఎన్టీఆర్ మ్యానియాతో 'ఫిఫా' స్టెప్పులు.. రియాక్ట్ అయిన తారక్
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. కొమురం భీమ్ పాత్రలో ఆయన నటనకు అద్భుతమైన ప్రశంసలు వచ్చాయి. మవవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడంతో.. ఎన్టీఆర్ వరల్డ్ వైడ్ గా బాగా పాపులర్ అయ్యారు. అలానే ఫుట్‌బాల్ గేమ్ కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజాదరణ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఏకంగా FIFA సోషల్ మీడియా అకౌంట్ పోస్ట్‌లో ఎన్టీఆర్ ని పేరుతో పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.
ఈరోజు దిగ్గజ ఫుట్ బాల్ ఆటగాళ్లు నెయ్‌మార్, టేవెజ్, క్రిస్టియానో రొనాల్డో.. తమ బర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఫిఫా వరల్డ్ కప్ తన ఇన్‌స్టా పోస్టులో.. వారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్ లో వారి ముగ్గురి మొదటి అక్షరాలను NTR అంటూ.. RRR మూవీలోని నాటు నాటు హుక్ స్టెప్ కి వారు డాన్స్ వేస్తున్నట్లుగా రిలీజ్ చేసింది. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియా వ్యాప్తంగా ఫుల్ ట్రెండింగ్ గా మారింది. లక్షల్లో లైక్స్, కామెంట్స్ చేస్తూ నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు.

ఈ పోస్టుపై జూనియర్ ఎన్టీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. హాహా.. హ్యాపీ బర్త్ డే నెయ్‌మార్, టేవెజ్, రొనాల్డో అని కామెంట్ చేశారు. అలానే ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ కూడా.. మూడు హార్ట్ సింబల్స్‌ను పోస్ట్ చేసింది. తారక్ అభిమానులు సైతం ఈ పోస్ట్ చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు. ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే దేవర 1 బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం.. టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 చిత్రంలో నటిస్తున్నారు.












Click it and Unblock the Notifications