బిగ్‌బాస్ -8 తొలి ఎలిమినేషన్ ఆమె..?
తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ 8వ సీజన్ ఘనంగా ఆరంభం అయింది. ఈసారి ప్రోమోలతోనే అదరగొట్టిన బిగ్‌బాస్ , దానికి మించిన కంటెంట్‌తో ఆకట్టుకుంటారని అంతా భావించారు.అయితే ఈ సీజన్‌లో పెద్దగా పేరున్న ఆర్టిస్టులు లేకపోవడంతో షో యామమాన్యంపై అభిమానులు పెదవి విరుస్తున్నారు.మరోవైపు కంటెస్టెంట్లు సైతం మొదటివారంలో పెద్దగా ఆకట్టుకున్నట్టు కనిపించలేదు. తొలి రోజు నుంచే హౌస్ మేట్స్ తమ స్టేటజీలతో గేమ్‌ను స్టార్ట్ చేశారు. రెండో రోజు నుంచే కంటెస్టెంట్ల మధ్య గొడవలు మొదలయ్యాయి.అయితే ఈ గొడవలు చూడటానికి కొంచెం అతిగా అనిపించాయి.
వంట దగ్గర నుంచి హోస్ శుభ్రంగా ఉంచుకోవడం, బాత్ రూమ్స్ నీట్‌గా లేకపోవడం అంశాలపై హౌస్‌మెట్స్ మధ్య గొడవలు జరిగాయి. ఇక మణికంఠ సెంటిమెంట్‌తో ప్రేక్షకుల మెప్పు పొందాడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇదే సమయంలో శేఖర్ బాషా సమయం సందర్భం లేకుండా చెబుతున్నా ప్రాసలతో ప్రేక్షకులను బోర్ కొట్టిస్తున్నారు. హీరో ఆదిత్య ఓం అసలు హౌస్‌లో ఉన్నారా అనే అభిప్రాయం కలుగుతోంది. ఆయన మొదటి వారంలో పెద్దగా కనిపించలేదు.

సోనియా ఆకుల, పృథ్విరాజ్ అభయ్ నవీన్, ప్రేరణ, కిర్రాక్ సీత, నబీల్ ఆఫ్రిది పర్వాలేదనిపించారు. నైనిక,నిఖిల్ తమదైన గేమ్‌తో ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తున్నారు. ఇక బెజవాడ బేబక్క బిగ్‌బాస్ అభిమానులను తీవ్ర నిరాశ పరిచిందనే చెప్పాలి. హౌస్‌లో ఆమె ఓవర్ యాక్షన్ చేసిందని మెజార్టీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అసలు గేమ్ ఆడకుండా , ప్రేక్షకులను డిస్పాయింట్ చేశారామె. హౌస్‌లో ఆమె ప్రవర్తన కూడా కాస్తా అతిగా అనిపిస్తోంది. ఓట్లు కూడా ఆమెకే తక్కువగా పట్టినట్టు తెలుస్తోంది. దాంతో బిగ్‌బాస్-8లో తొలి ఎలిమినేషన్ బెజవాడ బేబక్కనే అవుతుందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications