బాలయ్య, వెంకీపై ఆధారపడ్డ రామ్‌చరణ్ జాతకం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న గేమ్ ఛేంజర్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజు తొలి షో చూసినప్పుడే అభిమానులు నీరసించిపోయారు. ఓవైపు పుష్ప2తో అల్లు అర్జున్ దూసుకుపోతుండగా, గేమ్ ఛేంజర్ ఆడకపోతే ఎంతో అవమానమవుతుందని మెగా అభిమానులు భావించారు. బన్నీ అభిమానులకు, మెగా అభిమానులకు యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. అనుకున్నట్లుగానే దర్శకుడు శంకర్ కాలం చెల్లిన కథ, కథనాలతో గేమ్ ఛేంజర్ ను అతి సాధారణ సినిమాగా మార్చి, థియేటర్ కు వచ్చినవారిని టార్చర్ పెట్టాడు. ఈ సినిమాతో దిల్ రాజుకు స్ట్రోక్ రావడం ఖాయమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న సినిమాపై కూడా ఇంతవరకు హైప్ లేదు.
రెండు సినిమాలకు వచ్చే టాక్ ను బట్టి..
సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్ భవిష్యత్తు డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలపై ఆధారపడివుంది. ఈ రెండు సినిమాలకు దర్శకులు బాబీ, అనిల్ రావిపూడి. ఇద్దరూ యువకులే. హీరోలను అభిమానులకు ఎలా చూపించాలో వారికి బాగా తెలుసు. ఈ రెండు సినిమాలు హిట్ అయితే గేమ్ ఛేంజర్ భారీ ఫ్లాప్ ను మూటకట్టుకుంటుంది. అలా కాకుండా ఈ రెండు సినిమాల్లో ఒకటి హిట్ అయితే సోసోగా ఎలాగోలా తక్కువ నష్టాలతో బయటపడే అవకాశం ఉంది. థియేటర్ టికెట్ ధరలు కూడా పెంచుకోవడంతో ప్రేక్షకులు వస్తారా? రారా? అనేది చూడాలి. ఎందుకంటే పుష్ప2 తెలుగులో ఫ్లాప్ గా నిలిచింది. అత్యధిక టికెట్ ధరలుండటంతో ప్రేక్షకులెవరూ ఆ సినిమా ఆడుతున్న థియేటర్లవైపు తొంగిచూడలేదు.

డాకూకు థియేటర్లు ఇవ్వకపోతే ఇబ్బందే
బాలయ్య వరుసగా హ్యాట్రిక్ సాధించి మంచి ఊపుమీద ఉన్నారు. డాకూ మహారాజ్ కూడా కచ్చితంగా ఆడుతుందనే ఆశాభావాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు మొదటి ప్రాధాన్యత అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే విడుదలైన ఈ రెండు సినిమాల ట్రైలర్లు ఆకట్టుకున్నాయి. ఈ రెండు సినిమాలు మినిమం గ్యారంటీతో వస్తున్నాయి కాబట్టి గేమ్ ఛేంజర్ కు కష్టాలు మొదలయ్యే అవకాశం ఉంది. అయితే నైజాంలో థియేటర్లు చేతిలో ఉన్న దిల్ రాజు గేమ్ ఛేంజర్ కే ప్రాధాన్యతనిస్తారు. ఒకవేళ డాకూ మహారాజ్ కు థియేటర్లు కేటాయించకపోతే బాలయ్యతో ఇబ్బందులు తప్పవు. గతంలో కూడా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా థియేటర్లలో బాగా ఆడుతున్న సమయంలో హఠాత్తుగా దాన్ని దిల్ రాజు తొలగించారు. అప్పటినుంచి కాల్షీట్లు అడుతున్నా దిల్ రాజుకు బాలయ్య ఇవ్వడంలేదు. ఇప్పుడు దిల్ రాజు ఏం చేస్తారో చూడాలి. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం నిర్మాత కూడా ఆయనే కాబట్టి.












Click it and Unblock the Notifications