అక్కినేని ఇంటికి కొత్త కోడలు.. సమంతకు కూడా తెలుసు?
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కుర్ర హీరోలంతా వివాహాలు చేసుకుంటున్నారు. నెమ్మదిగా సింగిల్ లైఫ్ కు గుడ్ బై చెబుతున్నారు. అయితే అక్కినేని నాగార్జున ఇంట్లో మాత్రం శుభకార్యం జరగకపోతుండటంతో అభిమానులు నిరాశకు లోనవుతున్నారు. నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ పెళ్లి చేయాలని నాగార్జున ప్రయత్నించినప్పటికీ తను ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. ధూళిపాళ్ల శోభితతో డేటింగ్ లో ఉన్నాడంటూ వార్తలు వస్తే వాటిని ఖండించాడు. నాగచైతన్య తమ్ముడు అక్కినేని అఖిల్ కు నిశ్చితార్థం జరిగిన తర్వాత వివాహం రద్దయిన సంగతి తెలిసిందే.
సినిమాలు కూడా ఫ్లాపవుతుండటంతో కాస్తంత విరామం తీసుకున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో త్వరలోనే ఓ సినిమా పట్టాలెక్కబోతోంది. దీని బడ్జెట్ రూ.100 కోట్లని తెలుస్తోంది. అక్కినేని అఖిల్ వెంట ఓ హీరోయిన్ పడుతోందని, ప్రపోజ్ చేయడంతో అఖిల్ కూడా ఒప్పుకున్నాడనేది వార్త సారాంశం. ప్రస్తుతం వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం నాగచైతన్య మాజీ భార్య సమంతకు తెలియడంతో ఈ విషయంలో అఖిల్ ను సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నాగచైతన్యతో విడిపోయినప్పటికీ అఖిల్ తో సమంతకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి.

పుట్టినరోజు నాడు అఖిల్ కు శుభాకాంక్షులు చెబుతూ సమంత పోస్ట్ చేసింది. పెళ్లి చేసుకుందామంటూ ఆ హీరోయిన్ అఖిల్ పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ గతంలో ఓ సినిమాలో కూడా నటించారు. ఆ సినిమా భారీ హిట్ కాకపోయినప్పటికీ అందులోని పాటలు మాత్రం అందరినీ ఆకట్టుకున్నాయి. ఇందులో వాస్తవమెంతో తెలియాల్సి ఉంది.
ఈ వార్త తెలిసిన అక్కినేని అభిమానులు మాత్రం ఆనందపడుతున్నారు. అన్నీ సక్రమంగా జరిగితే కనుక ఆ హీరోయిన్ అక్కినేని ఇంటికి కోడలు అవుతుందని అంటున్నారు. అక్కినేని ఇంట్లో ఓ శుభకార్యం జరిగితే ఆ కుటుంబం ఒడ్డున పడుతుందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications