'గుంటూరు కారం' ఫస్ట్ రివ్యూ ..మహేష్ మాస్ రాంపేజ్
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' సినిమా మరికొద్ది గంటల్లోకి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ - మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా కావడంతో 'గుంటూరు కారం'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టుగానే ట్రైలర్, పాటలు ఆకట్టుకోవడంతో గుంటూరు కారంపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్విట్టర్ రివ్యూ వచ్చింది. సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు కాబట్టి కథ వివరాలను పూర్తిగా తెలియజేయడం లేదు. సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిన్నప్పుడే కుటుంబానికే అనుకోకుండా దూరం అయిన హీరో, రెబల్‌గా మారి తిరిగి తన ఫ్యామిలీ ఎదురు అయిన తరువాత ఏం చేశాడు అన్నది ఓవరాల్‌గా సినిమా కథ.

ఫస్టాఫ్‌లో ఫుల్ మాస్ సీన్లతో నింపేసిన దర్శకుడు..సెకెండ్ ఆఫ్‌లో మాత్రం తన మార్క్ డైలాగులతో కట్టిపడేశాడని సమాచారం. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పినట్టుగానే గతంలో ఎప్పుడు చూడని మహేష్‌ను ఈ సినిమాలో చూస్తారని తెలుస్తోంది. సెకెండ్ ఆఫ్‌లో కొన్ని ఎమోషనల్ అండ్ మాస్ సీన్స్‌తో ఆకట్టుకుంటుందని టాక్ వినిపిస్తుంది.

ముఖ్యంగా రమ్యకృష్ణ, మహేష్ మధ్య వచ్చే సెంటిమెంట్ సన్నివేశాలు ప్రేక్షకులను హత్తుకునే ఉంటాయని సమాచారం. ఇక మహేష్ బాబు, శ్రీలీల మధ్య వచ్చే సీన్లకు ప్రేక్షకుల ఈలలు ఖాయమని అంటున్నారు. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్‌కు అదిరిపోతుందట. మొత్తానికి గుంటూరు కారం సినిమా మాస్ ప్రేక్షకులకు కిక్కిచ్చే విధంగా తెరకెక్కించినట్టు స్పష్టం అవుతుంది.
సినిమాలో మహేష్ డామినేషన్ పూర్తిగా కనిపిస్తోందని తెలుస్తోంది. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాల్లో హీరో, కథ కంటే త్రివిక్రమ్ డైలాగులే ఎక్కువుగా డామినేషన్ చేస్తాయి. కానీ ఈ సినిమాలో మహేష్ తన నటనతో దర్శకుడుపై పూర్తిగా అధిపత్యం చేలాయించినట్టు సమాచారం. 'గుంటూరు కారంతో అభిమానులకు మాస్ ఫీస్ట్ ఇచ్చిపడేశాడని అంటున్నారు.

మరి ఇదే నిజం అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక మాస్ రాంపేజ్ ఖాయమని చెప్పొచ్చు. ఇక ఆడియన్స్ ముందుకు వచ్చిన తరువాత సినిమా ఎలాంటి రచ్చ చేస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications