దెబ్బకు దిగొచ్చిన హరీష్ శంకర్
పవన్ కల్యాణ్ నటిస్తోన్న సినిమా.. ఉస్తాద్ భగత్ సింగ్. హైఓల్టేజ్ యాక్షన్ మూవీ ఇది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. హరీష్ శంకర్ దర్శకుడు. మైత్రీ మూవీస్ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. శ్రీలీల హీరోయిన్. అశుతోష్ రాణా, నవాబ్ షా, అవినాష్, గౌతమి కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. తమిళంలో విజయ్ నటించిన థేరి సినిమాకు రీమేక్ ఇది. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రమోషనల్ వర్క్స్, ఇతర కార్యక్రమాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు హరీష్ శంకర్. ఈ పరిస్థితుల్లో వివాదాల్లో పడ్డాడు. ఏకంగా మహేష్ బాబు- రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న వారణాసి మూవీకి సంబంధించిన ఓ ట్వీట్ కు రిప్లై ఇస్తూ రీపోస్ట్ చేశారు. మహేష్ బాబు సినిమాల బాక్సాఫీస్ రికార్డులను ఉస్తాద్ భగత్ సింగ్ బద్దలు కొట్టాలని ఓ అభిమాని ట్వీట్ చేశాడు. అందులో మహేష్ బాబు పేరుకు బదులుగా బాబ్ అని సెటైర్ గా రాశాడు. దానికి గ్రాంటెడ్ అంటూ యాజ్ ఇటీజ్ గా రీపోస్ట్ చేశారు హరీష్ శంకర్.

అది దుమారానికి దారి తీసింది. వివాదాల్లోకి నెట్టింది. మహేష్ బాబు అభిమానులు గుర్రుగా ఉన్నారు ఆయన మీద. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల ద్వారా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో హరీష్ శంకర్ దిగొచ్చారు. ఆ ట్వీట్ ను డిలెట్ చేశారు. వివరణ ఇచ్చారు. మహేష్ బాబు, ఆయన అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఈ వివాదానికి గల కారణాలను కూడా వెల్లడించారు.
ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో తీరికలేకుండా గడుపుతున్నానని, సెన్సార్ అనంతరం బోర్డు అధికారులతో సమావేశం, పెద్దమ్మ గుడి సందర్శన, పోస్ట్-ప్రొడక్షన్ పనులు, పాట ప్రోమో తుది తనిఖీలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోన్నానని, చివరిగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం థమన్ స్టూడియోకు కూడా వెళ్లానని అన్నారు. ఈ హడావుడిలోనే, ప్రోమోను ప్రశంసించిన జర్నలిస్టులు, అభిమానులు చేసిన ట్వీట్లకు జవాబిస్తోన్నానని, ఈ క్రమంలో ట్వీట్‌ను పూర్తిగా చదవకుండా, అనుకోకుండా కోట్ చేశానని తెలిపారు.
తాను ట్వీట్ చేసిన నిమిషంలోపే జరిగిన తప్పును గ్రహించి దాన్ని తొలగించానని హరీష్ శంకర్ పేర్కొన్నారు. సూపర్‌స్టార్ మహేష్ బాబు పట్ల తనకు అపార గౌరవం ఉందని పునరుద్ఘాటించారు. 'వారణాసి' అనేక రికార్డులు సృష్టిస్తుందని ప్రశంసించారు. తన ట్వీట్ అనుకోని తప్పిదమే తప్ప మహేష్ బాబును గానీ, ఆయన అభిమానులను గానీ బాధపెట్టే ఉద్దేశం ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. మహేష్ బాబు పుట్టినరోజున 'పోకిరి' గురించి తాను చేసిన ట్వీట్‌లే దీనికి నిదర్శనమని గుర్తు చేశారు.
ఆ చిన్న సంఘటన వల్ల ఎవరి మనోభావాలకైనా బాధ కలిగితే, హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. సినిమా రికార్డులు సృష్టించాలంటే, అన్ని వర్గాల అభిమానుల మద్దతు అవసరమని, తన చిత్రం 10 రోజుల్లో విడుదలవుతుండగా, ఇలాంటి పోస్టులు చేయనంత కనీస పరిజ్ఞానం తనకుందని దర్శకుడు వివరించారు.
-
కోర్టు జోడీ రోషన్, శ్రీదేవీ "బ్యాండ్ మేళం" సినిమా హిట్టా ? ఫట్టా ?? -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
నందమూరి బాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు.. జై బాలయ్య !! -
హనీమూన్ లో కొత్త జంట, ప్రైవేట్ రిసార్ట్‌లో ఆనంద క్షణాలు -
ఆ హీరోతో నటించాలని ఉంది.. కానీ అలా మాత్రం కాదు !! -
రీసెంట్ టైమ్ లో బెస్ట్ టీజర్.. నవ్వి నవ్వి పొట్ట చెక్కలే..!! -
పెళ్లి కంటే సహజీవనం బెస్ట్: మెగా హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ -
రాజకీయ వారసురాలు.. గ్లామర్ తార.. రామ్‌చరణ్ బ్యూటీని చుట్టుముట్టిన వివాదం! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
కొత్త బిజినెస్ షురూ చేసిన తెలుగు యాంకర్..! -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..!











Click it and Unblock the Notifications