జూనియర్ ఎన్టీఆర్‌కి ఏమైంది?... ఇలా మారిపోయాడు!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 చేస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇందులో హృతిక్ రోషన్ కూడా మరో హీరోగా నటిస్తున్నారు. యాక్షన్, స్పై అడ్వెంచర్ గా రానున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుంది. ఆ తర్వాత దేవర2 ఉండే అవకాశం ఉంది. తాజాగా మ్యాడ్2 చిత్రం విజయోత్సవ వేడుక జరిగింది. దీనికి ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
లుక్ మొత్తం మారిపోయింది
వేడుకకు హాజరైన ఎన్టీఆర్ ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. చాలా సన్నబడ్డాడు. ఇంతకుముందు మంచి దేహ దారుఢ్యంతో, కండలు తిరిగిన శరీరంతో మనిషి చాలా దృఢంగా ఉండేవాడు. మరీ సన్నగా కాకుండా, మరీ లావుగా కాకుండా మీడియంగా ఉండేవాడు. ఆ రూపం అందరికీ నచ్చింది. అయితే అకస్మాత్తుగా ఇంత సన్నబడిపోవడంతో ఎవరికీ నచ్చడంలేదు. అప్పుడే అందంగా ఉండేవారని, ఇప్పుడు హీరో లుక్ లేదంటున్నాయి. అయితే మరికొందరు మాత్రం ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఇలా మారిపోయాడని, అప్పటికన్నా ఇప్పుడే బాగున్నాడని మరికొందరు అంటున్నారు.

కాలర్ ఎగరేసుకునేలా ఉంటుంది
ప్రశాంత్ నీల్ సినిమా స్క్రిప్ట్ ప్రకారం అలా మారిపోయాడా? లేదంటే తనంతట తాను అలా సన్నబడ్డాడా? అనే విషయం మాత్రం తెలియదు. మ్యాడ్ 2 ఫంక్షన్ లో తారక్ మాట్లాడుతూ అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా దేవర2 చిత్రం ఉంటుందని, ఆ విషయంలో తనది హామీ అన్నారు. సూర్యదేవర నాగవంశీ మీకు త్వరలోనే ఓ వార్త చెబుతాడని, తనతో సినిమా తీస్తున్నాడని, అతను ఆ వివరాలు చెప్పిన తర్వాతే తాను స్పందిస్తానన్నారు. బహుశా దిలీప్ కుమార్ దర్శకత్వంలో తారక్ నటించబోయే సినిమాకు నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడేమోనని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ విషయం స్పష్టంగా తెలియాలంటే కొద్దిరోజు ఆగక తప్పదు. ఏదేశమైనప్పటికీ ఎన్టీఆర్ సన్నబడటం మాత్రం చాలామందికి నచ్చడంలేదు. కొంచెం అన్నా పెరగాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications