టబుకు నాగార్జున పెట్టిన ముద్దు పేరు తెలుసా?
తెలుగు సినీ పరిశ్రమలో ఎవర్ గ్రీన్ రొమాంటిక్ ఆన్ స్క్రీన్ పెయిర్ అక్కినేని నాగార్జున, టబు అని చెప్పొచ్చు. వీరిగురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. వీళ్ల కాంబినేషన్ లో వచ్చి సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ సినిమాలుగా నిలిచాయి.
ప్రేక్షకుల్లో కూడా ఈ జంటకు ఎంతో క్రేజ్ ఉండేది. చేసే ప్రతి సినిమాలో వీరి రొమాన్స్ హైలైట్ గా నిలిచేది. వీరి కాంబోలో వచ్చిన నిన్నే పెళ్లాడుతా సినిమా పెద్ద హిట్ గా నిలిచింది. బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పొచ్చు.

ఇప్పటికీ నిన్నే పెళ్లాడుతా సినిమా టీవీల్లో వస్తుంటే ప్రేక్షకులు ఆసక్తికరంగా చూస్తుంటారు. ప్రేమికులైతే ఈ సినిమాకు ఫిదా అవుతారు. పాటలు కూడా చాలా బాగుంటాయి. నాగార్జున-టబు మధ్య ఏదో ఉందంటూ టాలీవుడ్ మీడియాతోపాటు బాలీవుడ్ మీడియా కూడా కోడై కూసింది.
చాలాసార్లు అధికారికంగానే వీరిద్దరూ దీనిపై స్పందించారు. తమ మధ్య స్నేహం తప్పితే ఏమీ లేదన్నారు. అమలకు కూడా తమ స్నేహం గురించి తెలుసని నాగార్జున ఎన్నోసార్లు చెప్పారు. ఇలాంటి క్రమంలోనే నాగార్జున టబుకు పెట్టిన ముద్దుపేరు వైరల్ గా మారింది.

ఆ పేరును ఒక గ్రాండ్ ఈవెంట్ లో నాగార్జున బయటపెట్టాడు. సినీ పరిశ్రమ వజ్రోత్సవ వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడు టబు పక్కనే ఉన్న నాగార్జున ఆమెకు పెట్టిన ముద్దుపేరును గుర్తుచేశాడు. నిన్నే పెళ్లాడుతా సినిమాలో పండు పండు అంటూ బాగా ఏడిపిస్తాడు. ఆ సీన్ ఎవరూ మర్చిపోలేరు. ఆ పండు అనే పేరునే ఇప్పటికీ నాగార్జున టబును ముద్దుగా పిలుస్తుంటారు.
ఈ విషయాన్ని నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు. సీనియర్ పాత్రల్లో టబు అనేక పాత్రలు పోషిస్తోంది. నాగార్జున కూడా తన 100వ సినిమా కోసం జాగ్రత్తగా కథలు వింటున్నాడు. సినిమాను భారీగా తీర్చిదిద్దాలని భావిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో దీన్ని చిత్రీకరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications