Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తిరుమలలో స్టార్ హీరో, కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు, ఫ్యామిలీ గొడవలకు చెక్ పెట్టినట్లే

చాలెంజింగ్ స్టార్ దర్శన్ ఇటీవల తన వ్యక్తిగత సమస్యలతో సతమతం అవ్వడమేకాకుండా వార్తల్లో నిలిచాడు. అంతేకాకుండా కాటేరా సినిమా ఘన విజయాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. వీటన్నింటి మధ్య దర్శన్ తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తరువాత శ్రీకాళహస్తి ఆలయంలో మల్లికార్జున స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

స్యాండిల్ వుడ్ హీరో దర్శన్ ఆయన కుటుంబ సభ్యులతో కలసి పుణ్యక్షేత్రాలు సందర్శించి మా ఇంట్లో అంతా సవ్యంగా ఉందని అభిమానులు, మీడియాకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించారని తెలిసింది. హీరో దర్శన్‌తో తాను పదేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు కన్నడ నటి పవిత్రా గౌడ ఇటీవల సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఆ తరువాత చాలెంజింగ్ స్టార్ దర్శన్ భార్య విజయలక్ష్మి, నటి పవిత్రా గౌడల మధ్య సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున గొడవ మొదలైంది.

Hero Darshan who performed special pooja at Tirumala and Srikalahasti along with his family members

ఆ తర్వాత హీరో దర్శన్ ఇద్దరికి క్లాస్ పీకినట్లు తెలిసింది. ఆ తరువాత ఇద్దరూ సైలెంట్ అయ్యారు. ఇప్పుడు దర్శన్ ఆయన భార్య విజయలక్ష్మితో పాటు ఆయన కుమారుడు వినీష్‌తో కలిసి తిరుమల, శ్రీకాళహస్తిని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో హీరో దర్శన్ కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడులోని తిరునల్లూరు ఆలయాన్ని సందర్శించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.

ఈ ఏడాది నటుడు దర్శన్ పుట్టినరోజుకు ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది. కాటేరా సినిమా ఊహించని సక్సెస్ తర్వాత దర్శన్ 'డెవిల్ సినిమా షూటింగ్ ప్రారంభించాడు. అంతకు ముందే తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తిలోని పుణ్యక్షేత్రాలు సందర్శించారు. డెవిల్ చిత్రానికి మిలనా ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం హీరో దర్శన్ భార్య విజయలక్ష్మి, నటి పవిత్రా గౌడల ఇన్‌స్టాగ్రామ్ వార్ పోస్ట్‌లు వైరల్ అయ్యాయి. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడంతో సోషల్ మీడియాలో వాళ్లు పెట్టిన పోస్టులు విపరీతంగా వైరల్ అయ్యాయి.

న్యాయ పోరాటం చేస్తామని ఒకరిని ఒకరు ఇద్దరూ హెచ్చరించుకున్నారు. ఆ తర్వాత విషయం చల్లబడింది. విజయలక్ష్మి పెట్టిన పోస్ట్‌పై స్పందించిన నటి పవిత్రా గౌడ నటుడు దర్శన్‌తో తనకు ఉన్న సంబంధాల గురించి పోస్ట్ చేసింది. దర్శన్‌తో తీసుకున్న కొన్ని సన్నిహిత ఫోటోలను నటి పవిత్రా గౌడ సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో అవి వైరల్ అయ్యాయి. మరుసటి రోజే పవిత్రా గౌడ మరో వీడియోను షోషల్ మీడియాలో పోస్టు చేసింది. మా సంబంధం మొదలు అయ్యి 10 సంవత్సరాలు పూర్తి అయ్యిందని, మా సంబంధం ఇలాగే కొనసాగుతుంది అని పవిత్రా గౌడ పోస్టు చేశారు.

దీంతో హీరో దర్శన్ భార్య విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసి నటి పవిత్రా గౌడ వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలోనే ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఈ మహిళకు బుద్ధి ఉంటే ఇలా మరో మహిళ భర్తతో తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి ఉండేది కాదని, ఈ చర్యలు ఆమె నైతికతకు అద్దం పడుతోందని, ఆమె ఆదర్శాలు ఏమిటో కూడా ప్రపంచానికి చూపిస్తుందని, ఆ వ్యక్తి వేరే మహిళను వివాహం చేసుకున్నాడని తెలిసి కూడా ఆమె తన వ్యక్తిగత అవసరాలు, ప్రయోజనాల కోసం అతనితో (హీరో దర్శన్ తో) సన్నిహితంగా ఉంటుందని పవిత్రా గౌడ మీద విజయలక్ష్మి మండిపడిందది.

అంతే కాకుండా నటి పవిత్రా గౌడ, సంజయ్‌ ల కూతురు ఖుషీ గౌడ అని ఆ ఫోటోలు స్పష్టంగా రుజువు చేస్తున్నాయని విజయలక్ష్మి ఆరోపించారు. సాధారణంగా నేను వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటానికి సోషల్ మీడియాను ఉపయోగించనని, కానీ నా కుటుంబ ప్రయోజనాల కోసం నా స్వరం పెంచాల్సిన సమయం ఆసన్నమైందని నేను భావిస్తున్నానని, ఈ సమాజాన్ని తప్పుగా చూపించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హీరో దర్శన్ భార్య విజయలక్ష్మి నటి పవిత్రా గౌడను హెచ్చరించారు.

విజయలక్ష్మి పోస్ట్‌పై పవిత్రా గౌడ స్పందిస్తూ నా కుమార్తె ఖుషీ గౌడ హీరో దర్శన్ కూతురేనని ఇప్పటి వరకు తాను ఎక్కడా, ఎప్పుడూ చెప్పలేదని, నేను, దర్శన్ గత 10 సంవత్సరాలుగా సంతోషంగా కలిసి ఉన్నామని మాత్రమే చెప్పానని సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. ఒక్కటి గుర్తుంచుకోండి నేను ఇక్కడ ఏదైనా వ్యక్తిగత అవసరాలు లేదా అజెండా కోసం మాది 10 సంవత్సరాల సంబంధం అని చెప్పలేదని, మాది స్వచ్ఛమైన ప్రేమ అనే విషయం విజయలక్ష్మికి కూడా తెలుసు అని పవిత్రా గౌడ అన్నారు.

విజయలక్ష్మి నాకు చాలాసార్లు ఫోన్ చేసి ఈ విషయం గురించి నాతో మాట్లాడిందని, ఎటువంటి సమస్య లేదని ఆమె నాతో చెప్పారని నటి పవిత్రా గౌడ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే ఈ గొడవల తరువాత హీరో దర్శన్ ఆయన భార్య విజయలక్ష్మితో పాటు కుమారుడితో కలిసి తిరుమల, తిరుపతి, శ్రీకాలహస్తిలోని పుణ్యక్షేత్రాలు సందర్శించడంతో ఆయన ఫ్యామిలీ గొడవలకు బ్రేక్ పడిందని ఆయన అభిమానులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+