Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Ind Vs Aus match: హీరో రవితేజ సందడి: ఇష్టమైన క్రికెటర్ ఎవరంటే? సిరాజ్ బయోపిక్‌లో!

హైదరాబాద్: వన్డే ప్రపంచ కప్‌ టోర్నీలో భాగంగా ఆదివారం భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ పాట్‌ కమ్మిన్స్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. తొలి 15 ఓవర్ల ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు ఒక వికెట్‌ నష్టపోయి 71 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్ సందర్భంగా.. స్టార్ స్పోర్ట్స్ తెలుగు క్రికెట్‌ లైవ్‌లో మాస్‌ మహారాజ రవితేజ (Raviteja) సందడి చేశారు. రవితేజ న‌టిస్తున్న తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది.

Hero ravi teja telugu live commentary in india vs australia match.

రవితేజ తెలుగు క్రికెట్‌ లైవ్ కామెంటరీలో పాల్గోన్నారు. అనంత‌రం క్రికెట్ అభిమానులతో రవితేజ ముచ్చటించారు. పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. తనకు ఇష్టమైన క్రికెట్ ఎవరో కూడా చెప్పేశారు రవితేజ. విరాట్ కోహ్లీ ఆటిట్యూడ్, దూకుడు అంటే తనకు చాలా ఇష్టమన్నారు రవితేజ. కోహ్లీ బ్యాట్‌ను హ్యాండిల్ చేసే విధానం చాలా బాగుంటుందని చెప్పుకొచ్చాడు.

ఇందుకు సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. కాగా, ఒకవేళ బయోపిక్ చేయాల్సి వస్తే ఏ క్రికెటర్‌పై చేస్తారని రవితేజను ఓ అభిమాని ప్రశ్నించాడు. దీనికి రవితేజ స్పందిస్తూ.. మహమ్మద్ సిరాజ్ అని చెప్పారు. తనకు క్రికెటర్ బయోపిక్‌లో నటించే అవకాశం వస్తే.. తప్పకుండా సిరాజ్ బయోపిక్‌లో నటిస్తానని తెలిపారు.

కాగా, అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వరరావు థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. 1970లో స్టూవర్ట్‌పురంలో పాపులర్‌ దొంగగా చలామణిలో ఉన్న టైగర్ నాగేశ్వర్‌ రావు జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్, టీజర్‌ సినీ అభిమానులను ఆకట్టుకున్నాయి.

ఈ సినిమాలో రవితేజకు జోడిగా నుపుర్ సనన్ (హీరోయిన్ కృతి సనన్ సోదరి) నటించింది. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. గాయత్రీ భరద్వాజ్, అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, జుస్సు సెంగుప్త, మురళీ శర్మ, తదితరులు కీలకపాత్రలు పోషించారు.

ఇది ఇలావుండగా, ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 199 పరుగులు చేసి అలౌట్ అయ్యింది. దీంతో 200 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్.. 15 ఓవర్లలో 49 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ క్రీజులో ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+