సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని.. 40 ఏళ్ల వ్యక్తిని 20 ఏళ్ల అమ్మాయి ప్రేమిస్తే ??
స్టార్ హీరో సూర్య.. తమిళ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా తెలుగు ప్రజలకు కూడా సుపరిచితులే. తనదైన శైలిలో విభిన్న పాత్రలతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. స్టార్ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక వైపు నటుడిగా రాణిస్తూనే మరోవైపు అగరం ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాల్లో సైతం ఎందరికో అండగా నిలుస్తున్నారు. అందుకే సూర్య వెండితెర పైనే కాకుండా నిజ జీవితంలోనూ మంచి మనసుతో " రియల్ హీరో" గా పేరొందుతున్నారు.
ప్రస్తుతం సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం "విశ్వనాథ్ & సన్స్" . వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. యంగ్ బ్యూటీ మమితా బైజు హీరోయిన్ గా నటిస్తుండగా.. రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2026 జులైలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు.

40 ఏళ్ల వ్యక్తిని 20 ఏళ్ల అమ్మాయి లవ్ చేస్తే..?
కాగా 20 ఏళ్ల అమ్మాయికి 40 ఏళ్ల వ్యక్తికి మధ్య జరిగే కథతో 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రం రూపొందుతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. వయసులో తన కన్నా 20 ఏళ్లు చిన్నదైన మమితా బైజు ప్రేమిస్తున్నానంటూ సూర్య వెంటపడటం.. అతను ఆమె ప్రేమను తిరస్కరించడం ఈ వీడియోలో చూడవచ్చు. అంతే కాకుండా టీజర్‌లో సూర్యని సంజయ్ విశ్వనాథ్ అనే అంతర్జాతీయ పిస్టల్ షూటర్ పాత్రను చూపించారు.












Click it and Unblock the Notifications