మెగా ఇంటికి కోడలు కాబోతున్న రీతూవర్మ..!
బాద్ షా సినిమాతో సహాయ నటిగా సినీ కెరీర్ ను ప్రారంభించిన అచ్చ తెలుగమ్మాయి రీతూవర్మ 'ప్రేమ ఇష్క్ కాదల్'తో హీరోయిన్‌గా మారింది. తర్వాత విజయ్ దేవరకొండ సరసన పెళ్లిచూపులు సినిమాతో ప్రేక్షకుల నుంచి మెప్పు సంపాదించుకుంది. ఆ తర్వాత తమిళంలోకి అడుగుపెట్టి అక్కడ కూడా మంచి పేరు సంపాదించుకుంది. 'కన్నుమ్ కన్నుమ్ కొల్లైయాడితల్' సినిమా రీతూవర్మకు విపరీతమైన పాపులారిటీని సంపాదించిపెట్టింది. తెలుగులో మంచి టాలెంట్ ఉన్న హీరోయిన్లలో ఒకరుగా పేరు తెచ్చుకుంది.
స్వాగ్ సినిమాతో పలకరించిన రీతూవర్మ
అడపా దడపా సినిమాల్లో నటిస్తూ వస్తున్న రీతూవర్మ తాజాగా స్వాగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్ చేస్తుంటుంది. మెగా కుటుంబంలో ఎక్కడ ఏ చిన్న ఫంక్షన్ జరిగినా కచ్చితంగా కనపడుతుంది. దీంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మెగా కుటుంబంతో అంత మెరుగైన సంబంధాలు రీతూవర్మకు ఎలా ఉన్నాయబ్బా అనుకుంటున్నారు. ఒక మెగా హీరోను ప్రేమించిందని, అందుకే అక్కడ జరిగే వేడుకలకు వెళుతుంటుందని, ఆమె ప్రేమను ఇరువైపులా కుటుంబాలు ఒప్పుకున్నాయంటున్నారు. అయితే ఏ మెగా హీరోను పెళ్లి చేసుకుంటుందనే విషయం సస్పెన్స్ గా మారింది.

స్టార్ హీరోయిన్ గా మారడానికి ప్రయత్నాలు
తెలుగుతోపాటు, తమిళం, మళయాళ భాషల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా మారడానికి ప్రయత్నాలు చేస్తున్న అచ్చ తెలుగమ్మాయి రీతూవర్మ చేసుకోబోయే మెగా హీరో ఎవరబ్బా అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఒక్కొక్కరు ఒక్కో పేరు చెబుతున్నారు. ప్రస్తుతం మెగా కుటుంబంలో పెళ్లి కాకుండా మిగిలివున్న హీరోలెవరు అనే లెక్క తీస్తున్నారు. ఫలానా హీరో అంటూ ఒకరు కామెంట్ పెడుతుంటే కాదు.. మరో హీరో అంటూ మరో నెటిజన్ కామెంట్ పెడుతున్నారు. అయితే ఫైనల్ గా మాత్రం ఆ హీరో ఎవరు? అనే విషయంలో మాత్రం స్పష్టత రావడంలేదు. ఏదేమైనప్పటికీ వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత మరో మెగా హీరో కూడా మరో హీరోయిన్ ను ప్రేమించి పెళ్లిచేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications